Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రద్దా కపూర్ భారాన్ని నెత్తినేసుకున్న పరిణతి.. చివరకు ఇలా!
పాపం పరిణితి కష్టాలు అన్నీఇన్నీ కావు. బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ పడాల్సిన పాట్లన్నీ పరిణితి పడాల్సి వస్తోంది. ఏదో.. మంచి అవకాశం వచ్చింది కదా టాలెంట్ చూపెడుదాం అన్న పరిణితికి అలసట వచ్చేసింది. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పిక్ షేర్ చేసి ఈ విషయం చెప్పకనే చెప్పేసింది పరిణితి. బ్యాట్మింటన్ అంటే మామూల మరి!
భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'సైనా' అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో సైనా పాత్రలో పరిణితి చోప్రా నటిస్తోంది. తొలుత ఈ పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌కు తీసుకోగా.. ఈ పాత్ర చేయడం కోసం శ్రద్దా కపూర్, సైనా నెహ్వాల్ వద్ద బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే ఆ తరువాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రాజెక్టు నుండి ఆమె తప్పుకోవడం జరిగింది.
దీంతో సైనా పాత్రలో యాక్ట్ చేసే ఛాన్స్ పరిణితి చోప్రాని వరించింది. ముందుగా ఈ ఛాన్స్ వచ్చినందుకు తెగ హ్యాపీగా ఫీల్ అయిన పరిణితి చోప్రా.. ప్రస్తుతం తెగ కష్టపడాల్సి వస్తోంది. వెండితెరపై ఓ రియల్ క్రీడాకారిణిగా కనిపించాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు మరి. ఈ మేరకు పరిణితి కూడా సైనా నెహ్వాల్ వద్ద శిక్షణ తీసుకుంటోందట. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం సైనా వద్ద బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది పరిణితి.
తాజాగా బ్యాడ్మింటన్ ఆడుతూ అలసిపోయి పడుకుని ఉన్న ఓ ఫొటోను పరిణితి తన ట్విట్టర్లో షేర్ చేసింది. దీనికి ప్రాక్టీస్‌కు ముందు.. తర్వాత' అంటూ కాప్షన్ కూడా తగిలించి. పైగా సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు అని కామెంట్ చేసింది పరిణితి. అంటే పాత్ర కోసం అమ్మడి పాట్లు చెప్పరానివని అర్థమవుతోంది కదూ!