మెగాస్టార్ స్టార్ట్ చేశారు.. ప్రభుత్వం కూడా మొదలుపెట్టాల్సిందే: పరుచూరి కామెంట్స్
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా జనాలు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది పేద వాళ్ళు ఆకలికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అయితే వారిని ఆదుకునేందుకు సినీ పెద్దలు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భారీ విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే.

పరుచూరి పాజిటివ్ కామెంట్స్..
ఈ కష్ట కాలంలో అందరం ఒకటిగా ఉంటూ సహాయం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని చెప్పిన సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ సినీమా తారలు చేసిన సహాయం గురించి మాట్లాడారు. జనాలకు కష్టం వచ్చిన ప్రతిసారి సినిమా తారలు వారికి తోచినంత సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని అన్నారు.

సిసిసి ఆలోచన అద్భుతం..
మెగాస్టార్ మొదలు పెట్టిన కరోనా క్రిసిస్ చారిటీ ఆలోచన నిజంగా అద్బుతమని అన్నారు. మెగాస్టార్ శ్రీకారం చుడితే బాలక్రిష్ణ, నాగార్జున, అలాగే ఇతర హీరోలు చాలా బాగా సపోర్ట్ చేశారు. సినీమా ఇండస్ట్రీలో ఉన్న పేద కార్మికులను బాధ్యతగా ఆదుకుంటూ విరాళాలు సేకరిస్తున్నారు. నిజంగా ఇది అద్భుతమైన ఘట్టం. ఎన్నో వేల కుటుంబాలకు అండగా ఉండడం నిజంగా మెచ్చుకోదగిన విషయమని అన్నారు

మన హీరోలు బెస్ట్..
కరోనా వైరస్ కారణంగా జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు నిజంగా అద్భుతంగా సహాయం చేస్తున్నారు అంటూ మన హీరోలు చాలా గ్రేట్ అని పరుచూరి వివరణ ఇచ్చారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ తెలుగు సినీ కార్మికులకు తోచినంత సహాయం చేస్తున్నారని చెప్పారు.
Recommended Video

ప్రభుత్వం కూడా మొదలుపెట్టాలి..
ప్రజలకు సహాయపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా చాలా మంచి పద్దతిలో పాలనను కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు సినీమా హీరోలు మాత్రమే సినిమా కార్మికులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవడానికి అలాంటి పనులు మొదలుపెట్టాలని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











