చిరంజీవికి మెసేజ్ పెడితే ఇలా రిప్లై ఇచ్చారు: పరుచూరి గోపాలకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్బంగా సైరా యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

ఈ వేదికపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 2004లో సైరా కథకు పరుచూరి వెంకటేశ్వర రావు గారు రాసిన కథే సైరా అని చెప్పారు. చిరంజీవి గారికి కలకాలం గుర్తుండిపోయే కథ ఒకటి రాయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర రావు గారు ఈ కథ రాశారని, కానీ బడ్జెట్ పెట్టే వాళ్ళు లేకనే 14 ఏళ్ళు ఈ కథ ఆగిపోయిందని గోపాలకృష్ణ చెప్పారు.

 Paruchuri Gopala Krishna Comments On Sye Raa Thank You Meet

ఒక రూపాయిని ఒక పైసా లాగా ఖర్చు పెట్టాడు మహానుభావుడు రామ్ చరణ్. అందుకే ఇవాళ ఇంత గర్వంగా మనమంతా ఉన్నామని అన్నారు గోపాలకృష్ణ. ముందు 60 నుంచి 70 కోట్ల ఖర్చవుతుందని అనుకున్నామని అన్నారు. మాకు స్వాతంత్య్రం కావాలి.. మీరు దేశాన్ని వదిలి వెళ్ళండి అని బ్రిటిష్ వారితో మొదట పలికిన గొంతు తెలుగు వాడిది అని చెప్పాలన్న మా తపన, చిరంజీవి తపన ఈ సినిమా అని అన్నారు గోపాలకృష్ణ. సైరా సూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నా అని చిరు మెసేజ్ పెడితే.. సైరా మీ బిడ్డ, ఈ బిడ్డను ప్రపంచమంతా ఆశిర్వదిస్తోందని చిరంజీవి రిప్లై ఇచ్చారని ఆయన చెప్పారు. మా 16 సంవత్సరాల కోరిక ఇలా తీరిందని అన్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X