Paruchuri Gopala Krishna: క్షుణ్ణంగా చూస్తే తప్పా ఈగల్ సినిమా అర్థం కాదు.. అది డైరెక్టర్ సాహమే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సినిమా ఈగల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీనీ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అనుకున్న స్థాయిలో థియేటర్ల వద్ద ఆడలేకపోయింది. అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ రీవ్యూ ఇచ్చారు. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌తో రూపొందిన 'ఈగల్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు దావ్ జాంద్ సంగీతాన్ని అందించగా.. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా నటించారు. అలాగే నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధు బాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఈటీవీ విన్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇంట్లోనే కూర్చుని సినిమా చూసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఈ చిత్రంపై రీవ్యూ ఇచ్చారు.

ముఖ్యంగా తన విద్యార్థులకు ఈ సినిమాలో దర్శక, నిర్మాతలు చేసిన తప్పొప్పులను వివరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఏముందో చూద్దామని చూశానని అన్నారు. మహిళా ప్రేక్షకులకు, మాస్ ప్రేక్షకులకు తలతిప్పకుండా చూసే అంశాలు వేరువేరుగా ఉంటాయని.. అయితే ఈ సినిమాలో మాత్రం మాస్ ప్రేక్షకులలు తల తిప్పుకోకుండా చేసే ఎలిమెంట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలో పత్తి రైతుల సమస్యలను చూపించగా.. హీరో రైతు అని తాను భావించినట్లు చెప్పారు. అలాగే రవితేజ బాడీ లాంగ్వేజీకి ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉందని పేర్కొన్నారు.
కథ, కథనాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని.. కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేందుకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పరుచూరి చెప్పుకొచ్చారు. అలాగే స్క్రీన్ ప్లేను చాలా ఫాస్ట్ గా రన్ చేశారని.. ఈక్రమంలోనే కన్ ఫ్యూజన్ ఏర్పడింది అన్నారు. అయితే ఎవరు, ఎవరి గురించి చెబుతున్నారో కూడా కాస్త అర్థం కాలేదని.. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష.. ఇలా మూడు కోణాల్లో కథ చెప్పడం వల్లే ఈ సమస్య వచ్చిందని వెల్లడించారు. నవదీప్ పాత్ర కన్ ఫ్యూజ్ చేసిందని.. అలాగే సినిమాలో ప్రేమకథ లోపించిందని మొదట్లో అనిపించగా.. చివర్లో కనిపించదని తెలిపారు.

హీరో, హీరోయిన్ల నుంచి కాకపోయినా.. విలన్ గ్యాంగ్ నుంచి కాస్త కామెడీ రాబట్టారని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. అలాగే ఎమ్మెల్యే ఎపిసోడ్ లో కొండ గురించి మాట్లాడగానే కొన్ని పాత్రలు తీవ్రంగా భయపడడం... చాలా బాగుందన్నారు. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి అనే డైలాగ్స్ అదిరిపోయాయనని.. గన్ ఫైట్స్ తోనే సినిమా మొత్తం నడిపించారని స్పష్టం చేశారు. ఈ సినిమాలో ఒక్క సీన్ కు డిస్ కనెక్ట్ అయినా.. సినిమా అర్థం కాదని అన్నారు. పూర్తి కాన్సట్రేషన్ తో చూస్తేనే సినిమా పూర్తిగా అర్థం అవుతుందని వివరించారు.
అలాగే ఈతరం వాళ్లకు... ముఖ్యంగా మాస్ కు ఎంటర్ టైన్ మెంట్, యూత్ కు ప్రేమ కావాలనే విషయాలను నేటి దర్శకులు అర్థం చేసుకోవాలని చెప్పారు. అప్పుడే ఫలితం బాగుంటుందని అన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు అర్థం అయ్యేలా స్క్రీన్ ప్లేని నడిపిస్తే రెట్టింపు ఫలితం వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఫాలో అవుతూ సినిమాలు తీస్తే మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











