Paruchuri Gopala Krishna: "ఆ మూడు పాయింట్లే సలార్ సినిమా హిట్ అయ్యేలా చేశాయి"

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం సలార్. డిసెంబర్ 22వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే. అనేక రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాపై తాజాగా రైటర్ పరుచూరి గోపాల కృష్ణ రీవ్యూ ఇచ్చారు. సినిమా చాలా బాగుందని చెబుతూనే.. సలార్ హిట్టు కావడానికి మూడు మూడు కారణాలు ఉన్నాయని.. వాటిని చూసేందుకే ఈ సినిమా చూడాలని చెప్పుకొచ్చారు. పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబర్ స్టార్ హీరోగా వచ్చిన ఈ సలార్ చిత్రాన్ని హొంబలే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేయగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా కనిపించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా... దీన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. పార్ట్ 1 నే దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా చాలా బాగుందని పరుచూరి గోపాల కృష్ణ చెప్పారు.

Paruchuri Gopala Krishna Review on Prabhas Salaar Movie Check Details

జనాపదం, సాంఘికం, చారిత్రాత్మకం, పౌరాణికం ఇలా ప్రపంచ దేశాల్లో సినిమా ఎన్ని రకాలుగా ఉందో వాటన్నింటినీ ఒకే చోట ఉంచితే అదే సలార్ అవుతుందని పరుచూరి వివరించారు. ఇది ప్రభాస్ వన్ మ్యాన్ షో అని అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. అలాగే మరో కీలకమై దర్శకడు ప్రశాంత్ నీల్ అని ఆయన డైరెక్షన్ లో ఈ కథ ఇలా వచ్చి ఉండకపోతే ఇంత హిట్ అందుకునేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటూ చెప్పుకొచ్చారు. అలాగే దీన్ని భారతదేశంలో రిగిన కథగా చూపిస్తే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేది కాదని.. ఇందులో విపరీతమైన హింస ఉండడమే అందుకు కారణం అని అన్నారు.

అలాగే ఈ స్టోరీని మూడు చిన్న దేశాల్లో ఇది జరిగినట్టు చూపించారని.. అలాగే మూడు జాతులకు చెందిన కథగా చూపించారని పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. 1127, 1980, 2017 వరకూ ఈ కథనాన్ని నడిపించారని.. సాధారణ కథగా మొదలైన ఈ స్టోరీ అసలు కథను రివీల్ చేయడం... అలాగే అఖండ భారతదేశంలో కలవడానికి రాజమన్నార్ తండ్రి అంగీకరించలేదనే మాటలను స్పష్టంగా చూపించడం చూస్తేనే డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుందని అన్నారు.

Paruchuri Gopala Krishna Review on Prabhas Salaar Movie Check Details

సలార్ సినిమాలో ప్రభాస్ ను చాలా చక్కగా చూపించారని.. రైటర్ పరుచూరి గోపాల కృష్ణ వెల్లడించారు. అయితే ఈ సినిమా హిట్ గా నిలవడానికి ప్రధాన కారణం.. ఎవరైనా ఈ సినిమా ఎందుకు చూడాలని అడిగితే.. ప్రభాస్ నటన, ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే, స్నేహ ధర్మం కోసం ఈ సినిమా చూడాలని చెబాతనని అన్నారు. ఈ మూడు పాయింట్లే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడానికి ప్రధాన కారణాలు అని తెలిపారు. వీటి వల్లే సినిమా బ్లాక్ బ్సటర్ అయిందని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X