చిరంజీవితో ఇలాంటి సినిమా అంటే సాహసమే.. అనిల్ రావిపూడిపై పరుచూరి కామెంట్స్

ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) . యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద గత రికార్డులను బ్రేక్ చేసి.. దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మెగాస్టార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన రివ్యూ వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే?

టైటిల్ నుంచే ప్రత్యేకత
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిలే ఎంతో అందంగా ఉంది. మొదట ఇది పూర్తి కామెడీ అనుకున్నాను. కానీ, చిరంజీవి లాంటి స్టార్‌తో యాక్షన్ లేకుండా సినిమా తీస్తారా అనిపించింది. కానీ, సినిమా చూసిన తరువాత ఇది యాక్షన్-కామెడీ- థ్రిల్లర్ అని అర్థమైంది'అని పరుచూరి చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్‌లతో చేసినట్లుగా చిరంజీవితో పూర్తిగా కామెడీ సినిమా తీయడమంటే.. అది పెద్ద సాహసమేనని చెప్పాలి. అలాంటి సాహసాన్ని అనిల్ రావిపూడి విజయవంతంగా పూర్తి చేశాడంటూ ప్రశంసలు కురిపించారు.

Paruchuri Gopala Krishna Reviews Anil Ravipudi- Chiranjeevi s Mana Shankara Vara Prasad Garu

స్క్రీన్‌ప్లేలో మాస్టర్ స్ట్రోక్
'సినిమా ఫస్ట్ సీన్ లో హీరో పాత్ర, అతని గతం ప్రేక్షకులకు క్లియర్‌గా చూపించారని చెప్పారు. టీవీ సీరియల్ ఎలిమెంట్‌తో కథను ముడిపెట్టడం, హీరోకు కామెడీ టీమ్ ఏర్పాటు చేయడం, ఆ టీమ్‌లో హీరోయిన్‌ను ఉంచడం అన్ని ఎలిమెంట్స్ ను సరిగ్గా పూరించారు. అలాగే ప్రతి పాత్రకు న్యాయం చేశారు. చిరంజీవి టీంలోని హీరోయిన్ పాత్రకు క్లైమాక్స్ తో లింక్ చేయడం చాలా బాగుందని అన్నారు. మధ్యమధ్యలో వచ్చే ఎమోషనల్ డైలాగులు ప్రేక్షకులను కదిలించాయని, ముఖ్యంగా పిల్లల సెంటిమెంట్ సీన్ ఎంతో హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు.

ఈ సినిమాను చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలా నిర్మించారని, తొలి సినిమాతోనే తన తండ్రికి భారీ విజయాన్ని అందించి, మళ్లీ సింహాసనంపై కూర్చోబెట్టిందని ప్రశంసించారు. అలాగే.. వెంకటేష్, నయనతార ల పాత్రలు కూడా వినోదాన్ని రెట్టింపు చేశాయని అన్నారు. కామెడీ టీమ్‌లో ఉన్న హీరోయిన్ చివర్లో వెంకటేశ్‌ను పెళ్లి చేసుకోవడం ట్విస్ట్‌గా నిలిచిందని చెప్పారు. సోర్టీని కొనసాగిస్తూనే చిరంజీవి గతాన్ని మధ్య మధ్యలో చూపించిన హైలెట్ గా నిలిచిందన్నారు. మామ పాత్రను కూడా అనిల్ రావిపూడి చాలా చక్కగా డిజైన్ చేశారని, కుటుంబ విలువలను, భార్య భర్తల బంధాన్ని చాలా చక్కగ్గా తెరకెక్కించారని పరుచూరి ప్రశంసించారు.

'మా చిరంజీవి ఎప్పటికీ మా చిరంజీవే'
'ఇప్పటికీ అదే ఎనర్జీ, అవే స్టెప్స్, అవే మూమెంట్స్ చిరంంజీవి ఏ మాత్రం తగ్గలేదు. మా చిరంజీవి ఎప్పటికీ మా చిరంజీవే' అంటూ పరుచూరి ఎమోషనల్‌గా స్పందించారు. అనిల్ రావిపూడి అపజయం ఎరుగని దర్శకుడని, యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేస్తూ.. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడం చాలా అద్బుతం అని అభినందించారు. సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా, థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ ప్రేక్షకాదరణ పొందుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది కాబట్టే ఈ సిని రూ.350 కోట్లు వసూలు చేసిందనీ. మెగాస్టార్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X