Paruchuri Gopala Krishna: గుంటూరు కారం అందుకే తేడా కొట్టింది.. ఎన్ని తప్పులున్నాయంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో దాదాపు పదమూడేళ్ల తర్వాత వచ్చిన తాజా సినిమా గుంటూరు కారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదలై హిట్ గా నిలిచిన ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు ఈ సినిమా మహేష్ బాబు బాడీ లాంగ్వేజీకి ఏమాత్రం సరిపోలేదని చెప్పారు. అలాగే ఈ చిత్రంలో చేసిన అనేక తప్పుల గురించి వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటూరు కారం.. ఈ సినిమా పేరే అసలు ఈ చిత్రానికి తగ్గది కాదని చాలా సున్నితంగా వివరించారు రచయిత పరుచూరి. గుంటూరు కారం అనగానే.. ఫుల్ మాస్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారని... అది ఈ చిత్రంలో లేదని చెప్పుకొచ్చారు. అలాగే గుంటూరు వాళ్లబ్బాయి అన్న టైటిల్ పెడితే చాలా బాగా సెట్ అయ్యేదని.. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఆయన గుంటూరు ఫ్యామిలీకి చెందిన వాడని అర్థం అయ్యుండేదని అన్నారు. అలాగే సినిమాలో చాలా మైనస్ లు ఉన్నాయని చెప్పకనే చెప్పారు.

ముందుగా మహేష్ బాబు స్టాండర్డ్ లో ఈ సినిమా లేదని తనకు అనిపించిందని వివరించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు తాను చాలా కన్ఫ్యూజ్ అయ్యానని.. సినిమా ఆర్డర్ ప్రేక్షకులకు ఎలా అర్థం అయిందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఈ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ ఆడుకున్నారని.. రెండోసారి ఈ సినిమా చూస్తే ఇంకా బాగా అర్థం అయ్యేదని వివరించారు. 200 కోట్లతో తీసిన ఈ చితరానికి 201.89 కోట్లు వచ్చిందని చెబుతున్నారు.. కానీ 300 కోట్లు వస్తేనే అందరికీ ఈ సినిమా వల్ల లాభం జరిగిందని సినిమా వాళ్లు భావిస్తారని చెప్పుకొచ్చారు.

2022లో తీద్దామనుకున్న ఈ సినిమాను 2024కు వచ్చిందని.. పలు సమస్యల కారణంగా ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ. త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేక అద్భుతమైన సినిమాలు తీయగా... ఈ సినిమా మాత్రం ఎందుకో నాకు చాలా తేడాగా అనిపించిందని అన్నారు. కథను ఎందుకు అర్థం కాకుండా నడిపారో నాకు అర్థం కాలేదని చెప్పారు. హీరోతో ఒక చిన్న సంతకం పెట్టించుకుంటే లైన్ తో వచ్చిన ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ పండించడం చాలా కష్టం అని వివరించారు.

అలాగే హీరోను ప్రేమలో పడేసి సంతకం పెట్టించుకోవాలని హీరోయిన్ ను దింపడం బాలేదని.. ఇవి పాజిటివ్ దృక్పథాలు కావని పరుచూరి చెప్పుకొచ్చారు. మదర్ సెంటిమెంట్ ను మరింత డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అన్నారు. అలాగే సినిమాలో నెగిటివ్ గా చూపించిన పాత్రల్లో మార్పును చూపిస్తే బాగుండేదని.. రియలైజేషన్ ఉండి ఉంటూ ఈ సినిమా మరింత రీచ్ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఏమైనా గురూజీ, మహేష్ బాబుల సినిమాకు డబ్బు వచ్చినా.. హృదయానికి ఆ సంతృప్తి రాలేదని అన్నారు. ఇది చెప్పడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజమని అన్నారు.


Click it and Unblock the Notifications











