Paruchuri Gopala Krishna: "ఆ పది నిమిషాలు లేకపోతే హాయ్ నాన్న మరింత అద్భుతంగా ఉండేది"

నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన తాజా చిత్రం హయ్ నాన్న గురించి అందరికీ తెలిసిందే. దసరా సినిమా తర్వాత నాని హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. 2023లో నాని చేసిన రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టు అవడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. నానితో పాటు దర్శక, నిర్మాతలు కూడా తెగ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే మూడ్రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన రచయిత పరుచూరి గోపాల కృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆ పది నిమిషాలు లేకపోతే మరింత అద్భుతంగా ఉండేదని చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హాయ్ నాన్న టైటిల్ పేరు వింటేనే హాయ్ నాని అని చెప్పాలనిపిస్తుందని రచయిత పరుచూరి గోపాల కృష్ణ వెల్లడించారు. నాని హీరోగా చేసే అన్ని చిత్రాలు విభిన్నంగా ఉంటాయని.. కొత్త కొత్త ఎలివేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. మధ్యలో ఓ రెండు, మూడు సినిమాలు యాక్షన్ చిత్రాలు చేసినా.. సాధ్యమయినంత వరకు అద్భుతమైన కథలను మాత్రమే ఎంచుకుంటాడని వివరించారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించారని స్పష్టం చేశారు.

Paruchuri Gopala Krishna Shocking Comments About Nani Hi Nanna Movie

హాయ్ నాన్న సినిమాలో హీరోహీరోయిన్లు అయిన నాని, మృణాల్ ఠాకూర్ మధ్య బందం అయితే అదిరిపోయిందని పరుచూరి వివరించారు. ముఖ్యంగా హీరోకు సమానంగా హీరోయిన్ నటించడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని హాయ్ నాన్న చిత్రంలో మృణాల్ నటన అద్భుతంగా ఉందని వివరించారు. సినిమాకు హీరోహీరోయిన్లు రెండు కళ్లు అయితే శౌర్యువ్ స్క్రీన్ ప్లే మూడో కన్ను అని స్పష్టం చేశారు. హాయ్ నాన్న చక్కటి భార్యాభర్తల కథ అని.. పిల్లల్ని కనొద్దు అనుకునే భార్యను ఒప్పించి బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ మూలంగా విడిపోయిన భార్యాభర్తలను చూపిస్తూ కథతో శౌర్యువ్ కబడ్డీ ఆడుకున్నారని చెప్పారు.

సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలవడానికి కారణం శౌర్యువ్ స్క్రీన్ ప్లేనే అని పరుచూరి చెప్పుకొచ్చారు. ఫొటోగ్రాఫర్, సింగర్.. రెండు కళాత్మకమైన హృదయాలు కలిసినప్పుడు కచ్చితంగా విబేధాలు వస్తాయని అన్నారు. అలాగే నాని బాడీ లాంగ్వేజీలో శోభన్ బాబు, ఎన్నార్ లు కనిపిస్తారని తెలిపారు. కళాత్మక రంగాలకు చెందిన వాళ్లు ప్రేమలో పడడం స్టోరీ అయితే పిల్లలు వద్దు అనుకోవడంతో లాక్ వేశారని.. ఆ తర్వాత వారిద్దరూ ఎలా విడిపోయార్ చాలా చక్కగా చెప్పారని ప్రశంసల వర్షం కురిపించారు. ఊపిర ఆడకుండా.. పక్కకు క్షణం కూడా తల తిప్పకుండా చూసేంత అద్బుతంగా కథ ఉందని వివరించారు.

Paruchuri Gopala Krishna Shocking Comments About Nani Hi Nanna Movie

హాయ్ నాన్న ఓ అద్భుతమైన ప్రేమ కథ అని, అద్భుతమైన భార్యాభర్తల కథ అని, అద్భుతమైన తండ్రీకొడుకు కథ అని పరుచూరి వివరించారు. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డైరెక్టర్ శౌర్యువ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో చివరి పది నిమిషాలు లేకుండా ఉంటే కథ ఆకాశాన్ని తాకేదని.. మరింత ఎక్కువ రోజుల్లో థియేటర్లలో ఆడేదని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X