Paruchuri Gopala Krishna: హనుమాన్ సక్సెస్‌కు కారణం ఆయనే.. అవి తీసేసి, ఆ సీన్లు పెడితే నెక్స్ట్ లెవెల్!
రైటర్ పరుచూరి గోపాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథలు రాస్తూ.. అదిరిపోయే సినిమాలు చేసిన ఈయన తెలుగు సినిమాలకు ఎప్పుడూ రీవ్యూలు ఇస్తూ ఉంటారు. యూట్యూబ్ వేదికగా పరుచూరి పాటాలు అనే ఛానెల్ లో సినిమాకు సంబంధించిన ప్లస్సులు, మైనస్ ల గురించి చెబుతారు. అయితే తాజాగా ఈయన తేజా సజ్జా హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా హనుమాన్ పై రీవ్యూ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా గురించి కూలంకషంగా వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తేజా సజ్జా సరసన అమృత అయ్యర్ నటించింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, రోహిణి, సముద్రఖని, రాకేష్ మాస్టర్, రవితేజ వంటి వాళ్లంతా ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 12వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భాషల్లో రిలీజ్ చేశారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.256.83 కోట్ల వసూళ్లు రాబట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఓటీటీలో సినిమా చూసిన పరుచూరి గోపాల కృష్ణ సినిమాకు రీవ్యూ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా ఇంతగా సక్సెక్ కావడానికి కారణం.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే అని చెప్పుకొచ్చారు.
హిందూ ప్రజల అందరి అంచనాలకు తగ్గట్లుగా ఉన్న ఈ సినిమాకు.. చిన్న హీరోను తీసుకుని అదిరిపోయే పాయింట్లతో కథను మరింత హైలెట్ చేశారని వివరించారు. డైరెక్టర్ టాలెంట్ వల్లే ఈ సినిమా అద్భుతం సృష్టించిందని చెప్పారు. కేవలం హీరోకు దొరకిన ఆ రాయితోనే కాకుండా దేవుడి అండదండా కూడా ఆయనతో ఉన్నట్లు చూపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా చేశారన్నారు. అలాగే హీరోకి అక్కగా చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అదిరిపోయిందని.. పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చి ఫైట్ చేయడం అయితే మహా అద్భుతం అని వివరించారు.

అది మాత్రమే కాకుండా ఫస్ట్ ఆఫ్ అంతా పీక్ లెవెల్ కు తీసుకు వెళ్లి సెకండాఫ్ కాస్త నిరాశ పరిచారని అన్నారు. సెకండాఫ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి.. మరికొన్ని రొమాంటిక్ సీన్లు అంటే హీరోయిన్ తో హీరోకు మరిన్ని సీన్లు పెడితే బాగుండు అనిపించిందని పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. యూత్ కు దూరంగా ఉన్న కథను తీసుకుని.. యూత్ ను బాగా అట్రాక్ట్ చేయడం వెనుక డైరెక్టర్ ప్లాన్ చాలా బాగుందన్నారు. ఆయన ఆలోచనా విధానమే ఈ సినిమాను హిమాలయాల ఎత్తుకు చేర్చిందన్నారు. చిన్న హీరో, చిన్న సినిమా అయినా... హిమాలయాల అంత ఎత్తుకు చేరుకోవడానికి ప్రేక్షకులే ప్రధాన కారణం అని... ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ థాంక్స్ అంటూ వివరించారు.
మైథాలజీకి సంబంధించిన ప్రతీ సినిమా, కథల మన హిందూ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని... శక్తి లేని వాడికి శక్తనిచ్చే దేవతలుగా వారిని చూపిస్తే సినిమాలు బాగా ఆడతాయని వెల్లడించారు. పార్ట్ 2 కూడా చాలా బాగుండేలా ప్లాన్ చేస్తున్నారని పార్ట్ 1లో ఇచ్చిన హింట్స్ చూస్తే అర్థం అవుతుందని కూడా అన్నారు. చూడాలి మరి పార్ట్ 2 ఏ రేంజ్ లో హిట్ కొట్టనుందో.


Click it and Unblock the Notifications











