Paruchuri Gopala Krishna: "సైంధవ్ ఫ్లాప్ అవడానికి కారణాలు ఇవే.. ఆ తప్పులు చేయకపోతే హిట్ అయ్యేదే"

విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా వచ్చిన సైంధవ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా నిలవడానికి చాలా కారణాలు ఉన్నాయని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సైంధవ్ సినిమాలో.. విక్టరీ వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మలు హీరోయిన్లుగా నటించారు. ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, జయ ప్రకాశ్, బేబీ సారాలు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోషం నారాయణం ఈ చిత్రానికి సంగీతం అందించగా... ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే ఎడిటర్ బాధ్యతలను గ్యార్రి బి.హెచ్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేశారు.

Paruchuri Gopala Krishna Shocking Comments About Venkatesh Saindhav Movie

అయితే ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి రాగా.. తాజాగా పరుచూరి గోపాల కృష్ణ ఈ చిత్రాన్ని చూశారు. ఈక్రమంలోనే ఈ సినిమాకు రీవ్యూ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలు గురించి క్షుణ్నంగా వివరించారు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి మూల కారణం... ఈ సినిమాలో కూతురును బతికించుకోవాలనే మూల కథలో చివరకు కూతురు బతికిందా.. లేదు అక్కడే పడింది అసలు దెబ్బ అని చెప్పారు. ముఖ్యంగా హాయ్ నాన్న సినిమాలోనూ ఇదే మెయిన్ పాయింట్ కాగా.. పాపను కాపాడుకోవడం ఎమోషన్స్ ను చూపించడం ఆ సినిమాకు ప్లస్ అయ్యాయని అన్నారు.

ఏ సినిమాలో అయినా సరే చనిపోవడాన్ని చూపించకూడదని.. తనను ఎవరైనా సంప్రదించి ఉంటే ఈ క్లైమాక్స్ కు తాను అస్సలే ఒప్పుకునే వాడిని కాదని.. కచ్చితంగా మార్పించేవాడినని చెప్పారు. అలాగే మన దగ్గేర ఉన్నటువంటి ముకేష్ వంటి ఓ పెద్ద నటుడిని సినిమాలో పెట్టుకుని.. ఆయనకంటే పెద్ద వాడిగా మరో నటుడిని చూపించడం సరికాదని పరుచూరి చెప్పుకొచ్చారు. ఇతర భాషల్లో వాళ్లు ఎంత పెద్ద స్టార్ లు అయినా ఇక్కడి వారికి తెలియకపోతే వారిని మెయిన్ లీడ్ లో చూపించడం మంచిది కాదని అన్నారు. ముకేష్ ను మెయిన్ విలన్ గా చూపించి ఉంటే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Paruchuri Gopala Krishna Shocking Comments About Venkatesh Saindhav Movie

ఇక ఆ తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ కు వేరే భర్త ఉండడం.. ముఖ్యంగా ఉన్నట్లు చూపించడాన్ని తెలుగు ప్రేక్షకులు అస్సలే జీర్ణించుకోలేరని.. అది కూడా సినిమాకు మైనస్ గా మారిందని అన్నారు. ముఖ్యంగా భర్త ఉండగా.. హీరోకు దగ్గర అవడాన్ని తెలుగు ప్రేక్షకులు అస్సలే మింగుడు పడని విషయం అని తెలిపారు. అలాగే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే సినిమా మరోలా ఉండేదని స్పష్టం చేశారు. అలాగే పాప మా నాన్న సూపర్ హీరో.. మా నాన్న ఉంటే నాకు భయం లేదు అనే డైలాగ్ ను పెట్టి ఉండకోపోతే బాగుండని అన్నారు.

పాప చనిపోయే క్లైమాక్స్ పెట్టినప్పుడు ఇలాంటి డైలాగ్స్ అస్సలే పెట్టి ఉండకూడదని పరుచూరి తెలిపారు. ఓ సీన్ లో పాప నవ్వవేంటి నాన్నా అడిగినప్పుడు.. నవ్వుతో పాటు ఏడుపును చూపించడంలో వెంకటేష్ చక్కగా నటించారని అన్నారు. అలాగే తన కూతురును చంపుకుని.. మిగతా వాళ్లందరినీ బతికించడం అనేది భయంకరమైన సానుభూతి అని.. ఇది కేవలం సానుభూతే తప్ప రసానుభూతి కాదని తెలిపారు. మరి ఇంత వయోలెంట్ గా లేకపోయి ఉంటే వెంకటేష్ సినిమా హిట్ అయి ఉండేదని మరోసారి చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X