Paruchuri Gopala Krishna: ఫ్యామిలీ స్టార్ సినిమాలో అవే హైలెట్.. సినిమా ఎలా ఉందంటే?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా సినిమా ఫ్యామిలీ స్టార్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ అలరించిన ఈ సినిమాలో మృణాల్ థాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు కాగా.. థియేటర్ల వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమాపై తాజాగా పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు. సినిమాలో అవే అద్భుతం అని చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ హైప్ మధ్య ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు, టీజర్ లు కూడా అదిరిపోగా అంతా తెగ్ ఎగ్జైటింగ్ గా సినిమా చూశారు. చాలా మంది ఈ చిత్రం అద్భుతంగా ఉందని చెప్పగా మరికొంత మంది మాత్రం మామూలుగా ఉందంటూ వివరించారు. అయితే తాజాగా ఈ సినిమాపై రైటర్ పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు. సినిమా తాను పూర్తిగా చూడకపోయినప్పటికీ.. ప్రోమో చూశానని వివరించింది.

Paruchuri Gopala Krishna Shocking Comments About Vijay Devarakonda Family Star Movie

తనకు ప్రోమో చాలా బాగా నచ్చిందని.. ముఖ్యంగా ఇది విజయ్ దేవరకొండకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని అనిపించినట్లు చెప్పుకొచ్చారు. ఫలితాలు ఎలా ఉన్నా సినిమా బాగుందని తెలిపారు. అసలు ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉందని.. విజయ్ ను అంతా లవర్ బాయ్ అనుకుంటారని.. అందుకే దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టారని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని అందుకే ఇలాంటి టైటిల్ ఆలోచించుకుని పెట్టారని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రోమోలోనే రెండు, మూడు హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా కొత్తగా నాకు లైఫ్ లో ఏం బ్రేకులివ్వాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్ని పడగొట్టకపోతే చాలు అంటూ చెప్పిన డైలాగ్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు. పరుశురాం డైలాగ్ నిజంగా బాగుందన్నారు. హాయిగా లిఫ్టు వాడుకోక... ఇలా ఎందుకు మెట్లు ఎక్కి వస్తున్నారని అడిగిన డైలాగ్ కూడా చాలా బాగుందన్నారు. అంతర్లీనార్థం ఉన్న ఈ డైలాగ్ లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చూపించారన్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను అంత సులువుగా అర్థం చేసుకోలేమని.. ఇలాంటి డైలాగ్స్ వేస్తే కచ్చితంగా సినిమాను చూస్తారని చెప్పుకొచ్చారు.

అలాగే ఈ పిల్లతో సంబాషణ వద్దని చెబుతూనే.. మళ్లీ ఆమెతోనే ప్రేమలో పడడం చూపించడం ద్వారా హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చారన్నారు. అలాగే హీరోయిన్ పిన్ని అని పిలవమని చెప్పే డైలాగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అని తెలిపారు. ఈ సినిమాలో ఎక్కువగా డైరెక్టర్ పని తనం కనిపించిందన్నారు. అయితే తాను ఇంకా పూర్తిగా సినిమా చూడలేదని.. కానీ చూసిన తర్వాత పూర్తిగా విశ్లేషిస్తానని మరోసారి వివరించారు. సినిమాలోని డైలాగ్లు, డైరెక్టర్ టాలెంట్ తనకు భలే నచ్చాయని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X