Pushpa 2: ఓ సిల్లీ రీజన్‌తో అల్లు అర్జున్ సినిమా.. పుష్ప 2 పై పరుచూరి కామెంట్స్
Pushpa 2: టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథలు రాసి.. అదిరిపోయే సినిమాలను టాలీవుడ్ కు అందిన ఘనత ఆయన సొంతం. కథలు అందించడం మానేసిన గోపాల్ కృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినిమా విశ్లేషకుడుగా మారారు. ఏదైనా సినిమా గురించి చర్చిస్తూ ప్లస్సులు, మైనస్ ల గురించి చెబుతారు. వాటిలో లోపాలను సవరిస్తున్నారు. అలా తాజాగా అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో లో తెరకెక్కిన పుష్ప 2 పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తెరకెక్కిన సినిమా పుష్ప 2. గతేడాది డిసెంబర్ 5 విడుదలైన ఈ పాన్ ఇండియా పలు రికార్డులను బ్రేక్ చేసింది. దాదాపు రెండు నెలలు దాటిన ఇంకా దేశ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో పుష్ప 2 మువీ జనాలను తెగ ఆకట్టుకుంది. ఈ క్రేజ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2'పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పుష్ప 2 పై పరుచూరి గోపాలకృష్ణ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ' డైరెక్టర్ సుకుమార్‌ని అభినందించేందుకు ఫోన్ చేశారు.'సినిమా ఎలా ఉంది సర్?' అని అడిగాడు. కాడిని ఓ వైపు నువ్వు ఉంటే.. మరోవైపు అల్లు అర్జున్ ఉంటాడు.బరువంతా మీరు మోశారు. జోరుగా ముందుకెళ్తుందో' అని చెప్పా. అల్లు అర్జున్ లాంటి హీరోని వేలాడదీస్తూ ఓపెనింగ్ షాట్ చేయడం చాలా థ్రిల్ గా ఉంది. హీరో అలా ఇరుక్కుపోవడానికి ప్రధాన కారణం డబ్బు. అప్పుడప్పుడు చాలా చిన్న సందర్భాలు, విషయాలు పెద్ద ఘటనలకు దారితీస్తుంటాయి. అలాగే.. ముఖ్యమంత్రితో ఫొటో దిగాలనే ఓ సిల్లీ రీజన్ దాదాపు 3:40 గంటల సినిమాకి కారణమైంది ' అని అన్నారు.
'సీఎంతో ఫొటో దిగాలని హీరోయిన్.. హీరోని కోరడం. దీంతో ఆ హీరో వెళ్లి.. ముఖ్యమంత్రితో ఫొటో దిగాలని ఎమ్మెల్యేతో వెళ్లడం, ఫోటో దిగడానికి సీఎం నిరాకరించడంతో హీరో అవమానానికి గురవుతాడు. ఎలాగైనా సీఎం తో ఫోటో దిగాలని, భార్య ఇచ్చిన చిన్న మాట ప్రకారం.. ముఖ్యమంత్రినే పదవి వైదొలిగేలా చేయడం, ఆ పంతంతో ఆ పదవిలో రావు రమేశ్‌ని సీఎం చేయడం అనేది సిల్లీ రిజనే. వాస్తవానికి సీఎం అవమానించాడు. హీరో .. సీఎంపై పగ తీర్చుకోవాలి.వారి మధ్యనే ప్రధానంగా కథ సాగాలి. కానీ అందుకు భిన్నంగా కథ కొనసాగింది' అని అభిప్రాయపడ్డారు. పరుచూరి.

'ఇంటి పేరు విషయంలోనూ హీరో అవమానాలు ఎదుర్కొంటుంటాడు. పుష్ప రాజ్ ఎందుకు ఇంటి పేరు వాడుకోడో తెలియదు. కానీ, చివరిలో పుష్ప పేరు ముందు ఇంటి పేరు వేస్తారు. అలాగే.. పోలీసు ఆఫీసర్ ఫహాద్ ఫాజిల్ అనే క్యారెక్టర్ విలన్ కాదు. పుష్పరాజే ప్రతినాయకుడు లాంటి హీరో. పుష్పరాజ్‌పై కోపంతో అతని వ్యాపారానికి అడ్డుపడుతాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కు రావు రమేశ్ సపోర్టు చేస్తాడు. కానీ , ఆ వ్యక్తికే ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు.. ఫొటో దిగకుండా వదిలేసిన వాడు ఇంత సమర్థుడా? అని మాజీ ముఖ్యమంత్రికి అర్థమవుతుంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అలాగే అల్లు అర్జున్ లేడీ గెటప్పులో చాలా బాగా నటించారు. రష్మిక నటన కూడా అద్బుతం, ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, రీ రికార్డింగ్ మరో అద్భుతం. సినిమా క్లైమాక్స్ లో ఆడపిల్ల సెంటిమెంట్ సీన్స్ పెట్టడంతో మహిళా ప్రేక్షకులను మెప్పించగలిగారు. ఇదంతా డైరెక్టర్ ఘనత. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో 'పుష్ప'రాజ్‌లో రాజసం ఉట్టిపడుతుంది. 'శ్రీవల్లి నా పెళ్లాం.. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటాదో పపంచకానికి చూపిస్తా' అనే గొప్ప మాటని రాయడం బాగుంది. ఇలా ఓవర్ గా సినిమాపై పాజివిట్ రివ్యూ ఇచ్చారు పరుచూరి.


Click it and Unblock the Notifications











