ఆమె పవిత్రతకు అదే నిదర్శనం.. ఇంట్లో దాసిగానైనా సరే.. సీనియర్ నటిపై పరుచూరి కామెంట్స్

పరుచూరి గోపాలకృష్ణ అందరికీ గుర్తొచ్చేది భుజాన ఎర్రకండువాతో ఓ నిండైన ఆకారం. తెలుగు సినీ చరిత్రలో పరుచూరి బ్రదర్స్‌ది ఓ సువర్ణధ్యాయం. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావులు తెలుగు సినిమాను, కథలను ఓ మలుపు తిప్పారు. టాలీవుడ్‌కు కమర్షియల్ ఫార్మాట్‌ను, మాస్ హీరోయిజాన్ని నేర్పించారు. దాదాపు 350పైగా కథలను అందించిన పరుచూరి బ్రదర్స్ ఈ మధ్య కాస్త విరామం ఇచ్చారు. తన అనుభవాన్ని పాఠాలుగా చెబుతూ.. పరుచూరి పలుకులతో ఎంతోమందికి దగ్గరయ్యారు పరుచూరి గోపాలకృష్ణ.

నాటి సంగతులను వివరిస్తూ..

నాటి సంగతులను వివరిస్తూ..

పరుచూరి పలుకుల ద్వారా గోపాలకృష్ణ.. తాము చేసిన తప్పులు, కథ-కథనం రాయడంలోని మెలుకువలు నేటి తరానికి చెబుతూ ఉంటారు. తాము చేసిన సినిమాలు, అప్పడు జరిగిన సంఘటనల గురించి చెబుతూ ఉంటారు.

తాజాగా కిన్నెరపై..

తాజాగా కిన్నెరపై..

చెట్టు కింద ప్లీడర్‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కిన్నెర ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ కావాల్సిందని చెప్పుకొచ్చారు. ఆమెకున్న పర్సనాల్టీకి పెద్ద హీరోల పక్కన నటించాల్సిందే కానీ, కామెడీ జానర్‌లోకి వెళ్లేసరికి అలా జరిగిపోయిందని అన్నారు. ఎవరో ఓ జడ్జ్ అమ్మాయిని తప్పుగా కామెంట్ చేశాడని, ఆ విషయాన్ని వీరావేశంతో తనవద్ద చెప్పిందని పరుచూరి అన్నారు. మీరు పోలీసులకు ఫోన్ చేస్తారా? లేదా నన్ను చేయమంటారా? అని కిన్నెర అడినట్టు చెప్పారు

థ్యాంక్స్ అంటూ కోపం..

థ్యాంక్స్ అంటూ కోపం..

కాసేపు వాగ్వాదం జరిగాక.. పోలీసులకు ఫోన్ చేశాను.. జడ్జ్ అంటున్నారు.. అవసరమా? అని సదరు పోలీస్ ఆఫీసర్ అంటే.. అన్నగారికి విషయం చెప్పమంటారా? అని అడగ్గానే బయపడిపోయారని తెలిపారు. పోలీసులు వచ్చే లోపే ఆ జడ్జ్, ఆయనతో వచ్చిన వారు జారుకున్నారని తెలిపారు. అయితే ఆ ఘటన అంతా అయ్యాక కిన్నెర వచ్చి.. థ్యాంక్స్ అని కోపంగా చెప్పినట్టు పేర్కొన్నారు.

Recommended Video

Paruchuri Gopala Krishna About NTR's Major Chandrakanth Movie || Paruchuri Paataalu || Filmibeat
అదే నిదర్శనం..

అదే నిదర్శనం..

ఆమె పవిత్రతకు నిదర్శనం ఓ సంఘటన చెబుతానని అన్నారు. ఓ రోజు కిన్నెర తన అన్నయ్యను తీసుకుని, అతని పెళ్లి శుభలేఖను ఇచ్చేందుకు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. చెల్లికి పెళ్లి చేయకుండా.. నువ్వు ఎందుకు చేసుకుంటున్నావ్ అని అడిగితే.. ‘మీ ఇంట్లో దాసీగానైనా బతుకుతా.. ఎవర్నీ పెళ్లి చేసుకోన'ని కిన్నెర అన్నట్లు పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X