twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ జడ్జిమెంట్ కరెక్టే, కానీ అక్కడ దెబ్బ పడింది.. సీక్రెట్స్ బయటపెట్టిన పరుచూరి!

    |

    సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులు పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఆ చానల్ ద్వారా ఆయన అనేక సినిమాలకు సంబంధించిన విశేషాలు యావత్ తెలుగు ప్రజలందరితో పంచుకుంటున్నారు. మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విశేషాలను ఆయన ఒక వీడియో ద్వారా పంచుకున్నారు.. ఈ నేపథ్యంలోనే ఒక సినిమాకు సంబంధించిన పలు సీక్రెట్స్ అని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

    నందమూరి వారసుడిగా

    నందమూరి వారసుడిగా


    నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చాలా త్వరగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.. నందమూరి అభిమానులే కాక అనేక మందిని తనకు వ్యక్తిగతంగా అభిమానులుగా చేసుకున్నాడు. కెరీర్ మొదటి నుంచి ఆచితూచి సినిమాలు చేస్తూ వీళ్ళను ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో అనేక ఫ్లాప్ సినిమాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

    ఎన్టీఆర్ తప్పేమీ లేదు

    ఎన్టీఆర్ తప్పేమీ లేదు


    కెరీర్ మొదట్లో ఆయన చేసిన కొన్ని సినిమాలు అంత సత్ఫలితాన్ని ఇవ్వలేదు. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లరి రాముడు సినిమా గురించి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కాస్త డిజాస్టర్ సినిమాలు వచ్చినా అల్లరి రాముడు విషయంలో ఎన్టీఆర్ తప్పేమీ లేదని పరుచూరి గోపాలకృష్ణ తాజా వీడియోలో వెల్లడించారు.

    అలా మార్చడంతో

    అలా మార్చడంతో


    ఈ సినిమా కథను తాను తన సోదరుడు ఇద్దరం కలిసి ఎన్టీఆర్ కు ప్రగతి రిసార్ట్స్ లో వినిపించామని, ఆ సమయంలో అక్షరం మార్చకుండా ఈ సినిమా చేయాలని ఎన్టీఆర్ తమకు సూచించారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కొన్ని అనుకోని కారణాలతో తాను షూటింగ్ కి వెళ్ళలేకపోయాను అని, షూటింగ్ సమయంలో కొన్ని అనుకోని మార్పులు దర్శక విభాగం వాళ్లు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

    అందుకే ఆసక్తి తగ్గింది

    అందుకే ఆసక్తి తగ్గింది

    అలా అనుకోని మార్పులు చేయడం వల్ల సినిమా మీద జనంలో ఆసక్తి తగ్గిందని అన్నారు. అయితే ఈ సినిమా ఆడలేదని అందరూ భావిస్తారని కానీ సినిమా అప్పట్లో బాగానే ఆడింది అని ఆయన వెల్లడించారు.. ఎన్టీఆర్ సరసన గజాల, ఆర్తి అగర్వాల్ నటించిన ఈ సినిమా జూలై 2002 లో రిలీజ్ అయింది. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాను బి.గోపాల్ దర్శకత్వం వహించగా చంటి అడ్డాల నిర్మించారు.

    Recommended Video

    Gollapudi Maruthi Rao Biography || Filmibeat Telugu
    అలా చేస్తే బాగుండేది

    అలా చేస్తే బాగుండేది

    ఇక ఈ అంశం గురించి చెబుతూనే కేవీ రెడ్డి గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. ఒకప్పటి దర్శకుడు కె.వి.రెడ్డి ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక మళ్లీ దానిలో మార్పులు చేర్పులు ఎలాంటి పరిస్థితుల్లో చేసేవారు కాదు అని చెప్పుకొచ్చారు.. ఎవరైనా సలహాలు ఇస్తే వచ్చే సినిమాకి ఆ మార్పులు గురించి ఆలోచించవచ్చు అని దాటవేసే వారట. అలా చేసి ఉంటే ఈ సినిమా కూడా బాగా ఆడి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

    English summary
    Paruchuri Gopala Krishna on his youtube channel revaled some secrets of Allari Ramudu (2002). Paruchuri Gopala Krishna talks about how NTR was right but things went wrong later in connection to the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X