ఆయనకు ఆ ఇమేజ్ ఉంది.. పవన్ రీఎంట్రీపై పరుచూరి కామెంట్స్
పవన్ కళ్యాణ్ వెండితెరపై సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రాజెక్ట్‌లను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌ను ఆల్రెడీ మొదలుపెట్టగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోయే పీరియాడిక్ మూవీకి కొబ్బరికాయ కొట్టేశాడు. మైత్రీ మూవీస్‌లో హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమాను ప్రకటించేశాడు. ఇంతటి స్పీడ్‌లో పవన్ కళ్యాణ్ దూసుకుపోతుంటే.. సినీ పరిశ్రమ పునరాగమనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

పవన్ రీఎంట్రీపై పరుచూరి పలుకులు..
టాలీవుడ్‌లో పరుచూరి బ్రదర్స్‌ది ఓ రాజముద్రలాంటిది. వారి గురించి పరిచయం అవసరం లేదు. అయితే పరుచూరి గోపాలకృష్ణ.. తన అనుభవాన్ని జోడించి ఈ తరంవారికి పాఠాలు చెబుతున్నాడు. పరుచూరి పలుకులు పేరిట యూట్యూబ్ చానెల్‌లో సినీ విశేషాలు చెబుతూ ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఎంట్రీపైనా పరుచూరి స్పందించాడు.

గ్యాప్ ఉంటే సినిమాల్లో చేయండి..
పవన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ చేయడాన్ని అభినందించడానికే తాను మాట్లాడుతున్నాని వివరించాడు. ‘గ్యాప్ లేని రోజు రాజకీయాల్లో ఉండండి. గ్యాప్ వచ్చిన రోజు సినిమాలు చేయండి' అంటూ చెప్పేశాడు. ‘ వెల్‌కమ్ టు పవన్‌కల్యాణ్. పవన్‌కు ఒక విషయాన్ని చెప్పాను. మీరు వీధివీధి తిరిగి చెప్పేకంటే ఒక్క మీడియా ద్వారా , పాత్ర ద్వారా అద్భుతంగా వెళ్లిపోతాయి. కర్తవ్యం సినిమా చూసి చాలా మంది మహిళలు పోలీస్ ఆఫీసర్లు కావాలని అనుకున్నారు. సినిమా ప్రభావం అలాంటిది' పవన్ రాకను సమర్థిస్తూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు.

ఆయనకు ఆ ఇమేజ్..
అలాగే, ఇంకా ఆయన ఏమన్నాంటే.. ‘నటన, రచన భగవంతుడు ఇచ్చిన వరం. సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అంశాల్ని తెరపై మేము చూపిస్తుంటే అవి నచ్చి మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కొందరినైతే ఆరాధిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కి ఇమేజ్ ఉంది. అతను ఎంత మంచివాడో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత కూడా సినిమాలు తీశార'ని గుర్తు చేశాడు.

మేకప్ వేసుకోవడం తప్పేమీ కాదు..
‘1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత , 1994 ఎన్నికల్లో గెలవడానికి మేజర్ చంద్రకాంత్ సినిమా ఎంత ఉపయోగపడిందో మాకు తెలుసు.పవన్ ఎమ్మెల్యే అయినా నటిస్తూనే ఉండాలి. రాజకీయాల్లోకి వెళ్తే మేకప్ వేసుకోవడం తప్పేమి కాదు. పవన్ నిర్ణయాన్ని అభినందించడానికే నేను మాట్లాడుతున్నా'నని తన మనుసులోని మాటలను అందరితో పంచుకున్నాడు.


Click it and Unblock the Notifications











