twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా సైరాలో పవన్ కళ్యాణ్ మిస్.. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్

    |

    తొలి స్వతంత్ర్య సమర యోధుడైన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడని సైరా చిత్రాన్ని వీక్షించిన యావత్ సినీ లోకం కొనియాడింది. నిర్మాతగా రామ్ చరణ్, హీరోగా చిరంజీవికి సైరా ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.

     కొనియాడిన సినీ ప్రముఖులు..

    కొనియాడిన సినీ ప్రముఖులు..

    ఈ చిత్రాన్ని వీక్షించిన సినీ ప్రముఖులు చిరంజీవి నటనను, చిత్రాన్ని నిర్మించిన రామ్ చరణ్, తెరకెక్కించిన సురేందర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులెందరో చిత్రాన్ని చూసి పొగడ్తల వర్షం కురిపించారు.

     ప్రశసించిన రాజకీయ నేతలు..

    ప్రశసించిన రాజకీయ నేతలు..

    ఈ చిత్రాన్ని వీక్షించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా.. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. అంతగా అందర్నీ మెప్పించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ను చూసే అవకాశాన్ని అందరూ మిస్ అయ్యారు.

     సైరాపై పరుచూరి పలుకులు..

    సైరాపై పరుచూరి పలుకులు..

    టాలీవుడ్ టాప్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ గురించి పరిచయమే అక్కర్లేదు. పరుచూరి గోపాల కృష్ణ చెప్పే సినీ పాఠాలను ఎంతో మంది ఫాలో అవుతుంటారు. అందులో భాగంగా తాజాగా సైరా చిత్రం గురించి చెప్పుకొచ్చాడు. సైరాలో కొన్ని సీన్స్, డైలాగ్స్‌లు పేర్కొంటూ అవి సినిమాలో ఎంతో బాగుండేదని తెలిపాడు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    అలా పవన్, రామ్ చరణ్ మిస్..

    అలా పవన్, రామ్ చరణ్ మిస్..

    ఆయన తన వర్షెన్స్ చెప్పుకుంటూ క్లైమాక్స్ సీన్స్ గురించి వివరించాడు. తాను మొదటగా రాసుకున్న దాంట్లో చివరకు జాతీయ జెండా అలా రెపరెపలాడుతూ ఉంటే.. పవన్ కళ్యాణ్ వచ్చి.. పెద్దయ్యా నీ త్యాగం వృథా కాలేదు.. అంటూ చెబితే.. ఆకాశంలోని మబ్బులు సైరా రూపంలో వచ్చి మీసం మెలేస్తూ ఉంటే ఎండ్ కార్డ్ పడితే బాగుండని తెలిపాడు. అయితే పవన్ లేకపోయినా కనీసం రామ్ చరణ్‌ను అయినా పెట్టండని తాను కోరినట్టు తెలిపాడు. అయితే తామిద్దరం రాసిన వర్షెన్‌ను పుస్తక రూపంలో ప్రింట్ చేసేందుకైనా పర్మిషన్ ఇవ్వమని చిరంజీవిని అడుగుతానని చెప్పుకొచ్చాడు.

    English summary
    Paruchuri Gopalakrishna On Sye Raa Eleventh Hours. Surender Reddy Director Of Sye Raa Movie, He Thanked Ram Charn Who Produced Sye Ra aMovie To Give Chance To Work With Chiranjeevi And believe Him For Sye Raa
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X