సురేందర్ రెడ్డి హింసించాడు.. వేధించాడు.. ఎన్నో నిద్రలేని రాత్రులు
సైరా సినిమా ప్రారంభానికి ముందు మమ్మల్ని హింసాత్మకంగా వేధించాడు. ఊర్లు తిప్పాడు.. గదులు తిప్పాడు. పేజీలు మార్చాడు. ఏ స్పాట్‌కు వెళ్లితే ఎలాంటి సీన్లు వస్తాయోనని తపనతో కథ కోసం ప్రాణం పెట్టారు. అందుకే ఇదో గొప్ప సినిమాని అందరూ కొనియాడారు. అంత అద్బుతంగా తెరకెక్కించడం, అంత గొప్పగా రాంచరణ్ తీయడం వల్ల సైరా సినిమా గొప్పగా మారింది అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.
సైరా గురించి అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రిపోర్ట్ వస్తున్నది. అమెరికా నుంచి నా మనువరాలు ఫోన్ చేసి.. ఇరగదీశాడు అంటూ కామెంట్ వదిలింది. అమెరికాలో కూడా ఇలాంటి పదాన్ని వాడుతారా అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకొంటున్నాను అని పరుచూరి అన్నారు. అమెరికాలో సమరయోధుల గురించి సినిమాలు ఎక్కువగా తీస్తారు. అలాంటి చోట సైరా ప్రశంసలు అందుకోవడం గొప్పగా ఉంది. అందుకు కారణం సురేందర్ రెడ్డి అని పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు.

ఓ భారతీయ సినిమాగా రూపొందించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంత టెన్షన్, కష్టపడ్డారో అనే విషయాన్ని కళ్లారా చూశాను. ఈ సినిమా అత్యద్భుతంగా కనిపించేలా చేయాలన్న తపనతో నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారో నాకు తెలుసు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి క్రెడిట్ అంతా ఆయనదే. తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన అద్భుతం సురేందర్ రెడ్డి. మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మరోసారి ధన్యవాదాలు అని చిరంజీవి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











