Patriot Malayalam Movie Trailer Review: పేట్రియాట్ మూవీ ట్రైలర్ రివ్యూ

దశాబ్ధాలుగా మలయాళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా వెలుగొందుతున్నారు మోహన్‌లాల్, మమ్ముట్టి. ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు తమ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. దాదాపు 40 ఏళ్లకు పైగా వీరిద్దరి మధ్య చెక్కుచెదరని స్నేహం ఉంది. అయితే ఎందుకో కానీ వీరిద్దరూ తర్వాత కలిసి నటించడం కుదరలేదు. ఇద్దరితో సినిమాలు చేయాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అలాంటిది ఈ ఇద్దరు దిగ్గజాలు దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మూవీ పేట్రియాట్. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు.

ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, నయనతార, దర్శన, రేవతి, రాజీవ్ మీనన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మే 1న పేట్రియాట్ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

Patriot Malayalam Movie Trailer Review Mammootty and Mohanlal s spy action drama promises an intense story

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 4వ తేదీన పేట్రియాట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎర్నాకుళంలోని కవిత థియేటర్‌లో జరిగిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మోహన్‌లాల్‌, ఫహద్ ఫాజిల్ తదితరులు థియేటర్‌లో ట్రైలర్‌ను వీక్షించారు. ప్రస్తుతానికి మలయాళంలోనే ఈ ట్రైలర్ అందుబాటులో ఉండగా.. త్వరలో తెలుగు వెర్షన్‌లోనూ పేట్రియాట్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? 18 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి ఎలాంటి మేజిక్ చేశారు? ఈ వివరాలు పరిశీలిస్తే..

ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, జాతీయ అత్యవసర పరిస్ధితి, రాజకీయ కుట్రలు, త్యాగాల వంటి బ్యాక్‌డ్రాప్‌లో పేట్రియాట్‌ను తెరకెక్కించారు. దేశ ద్రోహి, దేశభక్తుడు అనే వాటి మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దేశం కోసం ఫహద్ ఫాజిల్ ఏదో మిషన్‌ని ఆపరేట్ చేస్తుండటం, సైబర్ సెక్యూరిటీ, డేట్ సైన్స్ చుట్టూ కథ తిరుగుతూ ఉంది. మోహన్‌లాల్- మమ్ముట్టిలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేయడం చూపించారు. అయితే ఈ మిత్రులిద్దరూ ఏ కారణం చేతనో విడిపోయి బద్ధ శత్రువులుగా మారతారని అర్ధమవుతోంది. అదేంటో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

ఈ ట్రైలర్‌లో చూపించిన కార్ ఛేజింగ్‌లు, స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్లాస్టింగ్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. భారతదేశంతో పాటు యూకే, అజర్‌బైజాన్, యూఏఈలలోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరుపుకోవడంతో పేట్రియాట్‌కు గ్రాండియర్ లుక్ వచ్చింది. పలు దేశాలలో కథ నడుస్తుందని దర్శకుడు ఇలా హింట్ ఇచ్చినట్లుగా ఉంది. మనుష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్‌ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉంది. సుశిన్ శ్యామ్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. మొత్తం మీద ఈ ట్రైలర్‌ పేట్రియాట్‌పై అంచనాలను పెంచేసింది.

Read more about: mohan lal mammootty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X