పావల శ్యామల పరిస్థితి విషమం.. దీనస్థితిలో సీనియర్ నటి!

Pavala Syamala: టాలీవుడ్‌లో ఒకప్పుడు వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala). ప్రస్తుతం ఆరోగ్యం తీవ్ర విషాదకరంగా ఉంది. దాదాపు 300కు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోంది. ఈ సమస్యలతో నడిరోడ్డుపై పడిపోయే స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలేం జరిగింది?

నటి శ్యామల గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మే 15 అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె వద్ద తగినంత డబ్బు లేకపోవడం వల్ల ఆస్పత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా కనీస మానవత్వం చూపలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

Pavala Shyamala Tragedy Veteran Actress Found Helpless on Road Amid Health Crisis

ఇక్కడితో పరిస్థితి ఆగలేదు. ఆస్పత్రి నుంచి బయలుదేరిన తర్వాత ఆమెను తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ కూడా అమానుషంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఆమెను వదిలేసినట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ, ఆ డైవర్ ఫుట్‌పాత్‌పై దింపి వెళ్లిపోయినట్లు సమాచారం. కదలలేని స్థితిలో, తీవ్రమైన నొప్పితో రోడ్డుపక్కన బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆమెను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు.

అటుగా వెళ్తున్న ప్రజలు ఆమెను గుర్తించి వెంటనే సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మానవత్వంతో స్పందించిన పోలీసులు ఆమెను సురక్షితంగా తరలించి, ఆర్కే ఫౌండేషన్ సహాయంతో సనత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన నటి, జీవితాంతంలో ఇలా దయానీయమైన స్థితికి చేరుకోవడం బాధకరంగా మారింది. గతంలో చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం అందించినప్పటికీ, నిరంతర వైద్య ఖర్చులు, స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల పరిస్థితి మళ్లీ క్షీణించింది.

ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, పరిశ్రమలో పనిచేసిన సీనియర్ ఆర్టిస్టుల భవిష్యత్ భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎన్నో సంవత్సరాలు సినీ రంగానికి సేవలందించిన నటీనటులకు వృద్ధాప్యంలో సరైన సహాయం అందకపోవడం, ఆరోగ్య సమస్యల సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరం. ఈ ఘటనపై మా(MAA)తో పాటు ప్రభుత్వాన్ని కూడా స్పందించాలంటూ కోరుతున్నారు. పావల శ్యామల వంటి సీనియర్ కళాకారులకు శాశ్వత వైద్య సహాయం, ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X