రాజోలు పాపతో పవర్ స్టార్ సయ్యాట...తెలుగు పింక్ లో లవ్ ట్రాక్ అట!

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా తెలుగులో గ్రాండ్ గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్ గ్రాండ్ ట్రీట్ ఇచ్చేసింది. మరి అమితాబ్ బచ్చన్ పాత్రకు పవన్ తనదైన టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో, లాయర్ గారు కాస్తంత రొమాన్స్ కూడా పండించబోతున్నారని తెలుస్తోంది.

అవును మరి, పింక్ స్టోరీ లైన్ లో పవర్ స్టార్ ఇమేజ్ తగ్గట్లు కాస్తంత మార్పులు చేర్పులు చేసిన దర్శక-నిర్మాతలు, పనిలో పనిగా లవ్ ట్రాక్ కూడా చేర్చేశారట. ఇక వకీలుగారు, ముచ్చటగా ముగ్గురు అమ్మాయిల్లోనే ఒకామెతో రొమాన్స్ చేయబోతున్నాడట. తెలుగులో ముగ్గురు అమ్మాయిల్లో అంజలి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్కు ఈడూ జోడూ సరిగ్గ సెట్ అవుతుంది కాబట్టి, రాజోలుపాపనే లాయర్ గారితో ఆడిపాడబోతోందట.

Pavan kalyan to Romance Anjali in Vakeel Saab

ఇక నివేథా థామస్ తాప్సీ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాబట్టి, అంజలి పాత్రకు పెద్దగా ఎమోషన్స్ క్యారీ చేసే అవసరం లేదు. అందుకే ఆమె ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకునే ఈ లవ్వాటను కథలో చేర్చినట్లు తెలుస్తోంది. మరి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న వకీల్ సాబ్, ప్రేక్షకులకు కీలకమైన సందేశం అందివ్వడంతో పాటూ, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా పంచబోతున్నాడన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X