జైలులో తల్లి పవిత్ర గౌడ.. కూతురు ఖుషి గౌడ ఫాదర్స్ డే ఎమోషనల్ పోస్ట్
కన్నడ సినీ పరిశ్రమలో సంచలనం రేపిన రేణుక స్వామి హత్య కేసులో స్టార్ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ అరెస్ట్ కావడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. వారు ప్రస్తుతం పోలీస్ రిమాండ్‌లో ఉండి విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే తల్లి పవిత్ర గౌడ జైలులో ఉన్న సమయంలో ఆమె కూతురు కుషి గౌడ సోషల్ మీడియాలో చేసిన పోస్టు భావోద్వేగానికి గురి చేసింది. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..
పవిత్ర గౌడ అరెస్ట్ తర్వాత ఖుషీ గౌడకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖుషినీ కూడా వదలకుండా నెటిజన్లు ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారు. తల్లి చేసిన పనిని ఖుషికి అంటగడుతూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

అయినా అలాంటివేమీ పట్టించుకోకుండా బ్యాడ్ కామెంట్స్, వేధిస్తూ మాటలతో దాడి చేసినందుకు థ్యాంక్స్. నా తండ్రిని కూడా మీరు వదలడం లేదు. 15 ఏళ్ల అమ్మాయి అనేది పట్టించుకోకుండా మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. అందుకు నేను థ్యాంక్స్ చెప్పుకొంటున్నారు.
ఇక ఫాదర్స్ డే సందర్భంగా ఆమె తల్లిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తల్లికి ఖుషి గౌడ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందించారు. అలాగే తన నుదుటిపై తల్లి ముద్దు పెడుతున్న ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. నీకు ఫాదర్స్ డే విషెస్ అంటూ తన తల్లికి దిష్టి తగలకుండా ఓ ఇమేజిని పెట్టి తన ప్రేమను పంచుకొన్నారు.
ఖుషి గౌడ పోస్టుపై నెటిజన్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నారు. కొంత మంది ఖుషికి అండగా ఉంటే.. మరికొంత మంది ట్రోల్స్‌తో వెంటాడుతున్నారు. కన్నడలో పవిత్ర గౌడ, దర్శన్ అరెస్ట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ధైర్యంగా తన తల్లికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడాన్ని అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











