అతడు నా భర్త కాడు.. ఆయనతో సహజీవనమే.. కృష్ణ ఫ్యామిలీ నాకు సపోర్ట్.. నరేష్‌తో పెళ్లిపై పవిత్రా లోకేష్ క్లారిటీ

ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌, నటుడు వీకే నరేష్ పెళ్లి వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతున్నది. ఇప్పటి వరకు తన అఫైర్‌పై స్పందించని ఆమె తాజాగా కన్నడ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానెల్‌ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో పవిత్రా లోకేష్ సంచలన విషయాలను వెల్లడించింది. పవర్ టీవీ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. వీకే నరేష్‌తో తన సహజీవనం గురించి క్లారిటీ ఇచ్చారు. పవిత్రా లోకేష్ వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

పవిత్రా లోకేష్, నరేష్ పెళ్లి వార్తతో

పవిత్రా లోకేష్, నరేష్ పెళ్లి వార్తతో

పవిత్రా లోకేష్, వీకే నరేష్ ఇటీవల మహాబలేశ్వర్‌లోని ఓ స్వామిజీ ఆశ్రయాన్ని సందర్శించారు. ఆ సందర్భంలో స్వామీజీ ఆశీస్సులు తీసుకొంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి నుంచి వారిద్దరి పెళ్లి వార్త వైరల్ అయింది. అయితే వీకే నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో ఈ పెళ్లి వార్త వివాదంగా మారింది.

స్ట్రింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు

స్ట్రింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు

మీడియాలో వీకే నరేష్‌తో పెళ్లి వార్తలపై పవిత్ర లోకేష్ పలు విషయాలను స్ట్రింగ్ ఆపరేషన్‌లో స్పష్టం చేశారు. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా నరేష్ ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఒప్పుకున్నారు. మా ఇద్దరి సహజీవనం, రిలేషన్‌షిప్‌కు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన ఫ్యామిలీ ఆమోదం ఉంది. అందుకే మేము పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నాం. ఫామ్‌హౌస్‌లో కృష్ణ, నరేష్, మేము కలిసి ఉంటున్నాం. అని పవిత్ర లోకేష్ చెప్పింది.

వీకే నరేష్ భార్యపై ఘాటైన వ్యాఖ్యలు

వీకే నరేష్ భార్యపై ఘాటైన వ్యాఖ్యలు

వీకే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆమె (రమ్య) సరిగా ఉంటే.. నరేష్ కుటుంబం ఆమె వెంట ఉండేది. ఆమెను నేను దూరంగా ఉండి చూశాను. కానీ ఆమె తీరు, ప్రవర్తన నాకు నచ్చలేదు. నా భర్తతో కలిసి ఉండనని ఆమె చెప్పింది. అలా ఆమె జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి అని పవిత్రా లోకేష్ చెప్పారు.

సుఖేంద్రతో నా పెళ్లి జరగలేదు..

సుఖేంద్రతో నా పెళ్లి జరగలేదు..

తన భర్తగా చెప్పుకొంటున్న, కన్నడ దర్శకుడు సుఖేంద్ర ప్రధాస్‌ గురించి పవిత్రా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. సుఖేంద్ర ప్రదాస్‌ను నేను పెళ్లి చేసుకోలేదు. అధికారికంగా మా ఇద్దరికి పెళ్లి జరగలేదు. మేము ఇద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. కొన్నాళ్లు సహజీవనం చేశాం. మాకు పెళ్లి కానప్పుడు విడాకుల ప్రశ్న లేదు. అతడు నన్ను ప్రశ్నించడు. నేను అతడి చర్యలను ప్రశ్నించను. మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికి సుఖేంద్ర కుటుంబ సభ్యులు నాతో సన్నిహితంగా ఉంటారు అని పవిత్రా లోకేష్ ఘాటుగా స్పందించారు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
వీకే నరేష్ అబద్దాలు చెప్పడు..

వీకే నరేష్ అబద్దాలు చెప్పడు..

వీకే నరేష్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పారు. నరేష్ అబద్ధాలు చెప్పడు. మోసం చేసినట్టు నాకు కనిపించలేదు.. మహేష్ బాబు తండ్రి కృష్ణ, అతని కుటుంబం నాతో ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నాను, నరేష్ జీవితంలో నాకు చోటు ఉంటే చాలూ.. నాకు ఎలాంటి డిమాండ్లు లేవు. నరేష్ భార్య రమ్య వ్యక్తిగత జీవితంలోకి నేను తలదూర్చను. అవసరమైతే నరేష్, ఆమెతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాను అని పవిత్ర లోకేష్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X