పవన్ కల్యాణ్ వద్ద ఎన్ని బైక్స్, ఎలాంటి కార్లు ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్‌దే రికార్డు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అట్టహాసంగా మంది మార్బలంతో పిఠాపురం అసెంబ్లీకి జరుగనున్న ఎన్నిక కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసైనికుల తోడు రాగా, ప్రజలు నీరాజనం పట్టగా ప్రభుత్వ కార్యాలయానికి చేరుకొన్నారు. అయితే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన వద్ద ఉన్న వాహనాల వివరాలను వెల్లడించారు. ఆ వాటి వివరాలు, వాటి ధర గురించిన విశేషాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ నామినేషన్ వేస్తున్నారనే వార్త చుట్టు పక్కల గ్రామాలే కాకుండా దేశవ్యాప్తంగా దృష్టిని సారించింది. దాంతో సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇక శాటిలైట్ ఛానెల్స్ ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో హడావిడితోపాటు హంగామా కూడా కనిపించింది.

Pawan Kalyan declared Harley Davidson Benz Maybach Rangerover Toyota Cruiser vehicles in his EC Affidavit

ఇక పవన్ కల్యాణ్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆస్తులు, అప్పుల వివరాల గురించిన వివరాల్లోకి వెళితే.. 164 కోట్ల ఆస్తులు, 65 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్టు ప్రకటించారు. గత 5 సంవత్సరాల్లో 191 శాతం మేరకు సంపదకు సంబంధించిన వృద్ది జరిగిందనే విషయం అఫిడవిట్‌లో స్పష్టమైంది.

ఇక పవన్ కల్యాణ్‌కు వ్యక్తిగతంగా ద్విచక్ర వాహనాలంటే చాలా ఇష్టం. తనకు వీలు చిక్కినప్పుడు లేదా షూటింగులో బుద్ది పుట్టినప్పుడు బైక్స్ నడుపుతూ తన సరదాను తీర్చుకొంటూ కనిపిస్తారు. అలాంటి అభిరుచి ఉన్న జనసేనానికి ఓ హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది. దాని విలువ సుమారుగా 40 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ బైక్‌ను ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచారు.

Pawan Kalyan declared Harley Davidson Benz Maybach Rangerover Toyota Cruiser vehicles in his EC Affidavit

అయితే పవన్ కల్యాణ్‌కు ఓ అరుదైన చరిత్రను కలిగి ఉన్నాడు. కొమురం పులి షూటింగ్ సమయంలో అంటే 15 ఏళ్ల క్రితం నలుపు రంగు హార్లీ డెవిడ్ సన్ బైక్‌ను దుబాయ్ నుంచి దిగుమతి చేయించుకొన్నారు. అప్పట్లో దాని విలువ 40 లక్షలు. అయితే ఆయన తెలుగు రాష్ట్రాల్లో తొలి హార్లీ డేవిడ్సన్ బైక్ కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ఇక పవన్ కల్యాణ్‌కు ఉన్న వాహనాల విషయానికి వస్తే.. బెంజ్ మేబ్యాచ్ ఎస్ క్లాస్ వాహనం ఉంది. ధాని విలువ సుమారుగా 3 కోట్ల రూపాయలు, ఇక 5.4 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది. ఇక అలాగే 2.3 కోట్ల విలువైన టయోటా క్రూజర్ కూడా ఆయన వద్ద ఉందని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X