పవన్ కల్యాణ్ హటావో రచయిత శ్రీనివాస్ అనుమానాస్పద మృతి.. సంచలనంగా చిట్టచివరి వీడియో!
వివాదాస్పద రచయిత బొగ్గుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈ దుర్ఘటన ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద చోటు చేసుకొన్నది. ఆయన ప్రయాణిస్తున్న కారు రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లడంతో నీట మునిగి ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడటంతో ఈ ప్రమాదంపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రచయిత బొగ్గుల శ్రీనివాస్ గురించిన వివరాల్లోకి వెళితే..
బొగ్గుల శ్రీనివాస్ వర్థమాన రచయితగా కొనసాగుతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడంపై ఆయన తన వ్యతిరేకతను పుస్తకం రూపంలో వెళ్లగక్కారు. పవన్ కల్ాయణ్ హటావో.. పాలిటిక్స్ బచావో అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం రిలీజ్ తర్వాత ఆయన విశేషంగా గుర్తింపు పొందారు. శ్రీనివాస్ రచించిన పుస్తకం సుమారుగా 8.5 లక్షల కాపీలు అమ్ముడుపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఏడాది అత్యధిక పుస్తకాలు అమ్మిన రచయితగా గుర్తింపు పొందారు.

శ్రీనివాస్ గత కొద్దికాలంగా కొన్ని అంశాలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. అయితే వివాదాస్పద రచయితగా ఏపీలోని పలు అంశాలు, అమరావతి రాజధాని విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.
అయితే తన మరణానికి ముందు బొగ్గుల శ్రీనివాస్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో వైసీపీ నేత, జడ్జి జడ శ్రవణ్ కుమార్ గురించి విమర్శనాత్మకంగా వీడియోను చేశారు. ఆయన ఈ వీడియోలో జడ శ్రవణ్ కుమార్‌పై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆయన వీడియోలో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని విషయంలో జడ్జి శ్రవణ్ కుమార్ తల ఎక్కడ పెట్టుకొంటాడు? లాయర్ నుంచి జడ్జీగా ప్రమోట్ కావడం కోసం ఆయన ఏం మాట్లాడారు? వీకే గారు.. వీకే గారు అంటూ చంద్రబాబు, నారా లోకేష్‌ను వెనుకేసుకు వచ్చాడు అంటూ విమర్శలు చేశాడు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో అమరావతి నాశనం అయిపోయింది. జగన్ పూర్తిగా నాశనం చేశాడంటూ ఏడుస్తూ ప్రతీ వాదనను చంద్రబాబుకు అనుకూలంగా మార్చాడు. ఇప్పుడు మాట మార్చి ఆయన ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, తెలుగు దేశం పార్టీ, పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని నిర్మించకుండా దుర్మార్గానికి పాల్పడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అని తన వీడియోలో చెప్పడం కనిపించింది.
ఇలాంటి వివాదాస్పద పరిస్థితుల మధ్య హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు పాలేరు రిజర్వాయర్ దూసుకెళ్లింది. కారు వెనుక భాగం కొంత మేరకే నీళ్లలో మునిగి ఉంది. వెనుక సీటులో కూర్చొన్న ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు దారి తీసింది. కారు డ్రైవర్ ప్రమాదం అనంతరం నాయకన్ గూడెం వైపు వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే ఆయన నుదురు, ముఖంపై గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేసి రిజర్వాయర్‌లో ప్రమాదంగా చిత్రీకరించారా? లేదా యాక్సిడెంట్‌లో గాయాలయ్యాయా? అనే అనుమానం వ్యక్తవుతున్నది. స్థానిక పోలీసులు ఈ కేసు పలు కోణాల్లో దర్యాప్తుం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











