నిహారిక కొణిదెల పెళ్లి కోసం పవన్ కల్యాణ్.. ఏం చేస్తున్నారంటే..
సినిమా షూటింగులు, రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగే కాకుండా.. రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. ఇటీవలో వకీల్ సాబ్ షూటింగుకు పవన్ హాజరై కొంత పార్ట్‌ను పూర్తి చేశాడు. ఈ లోగా తన సోదరుడు నాగబాబు కుమార్తె, సినీ నటి నిహారిక కొణిదెల వివాహం రావడంతో మరోసారి కొద్ది రోజులు వకీల్ సాబ్ షూటింగ్‌ను వాయిదా వేశారు.
నిహారిక పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగనున్నది. డిసెంబర్ 9న గుంటూరు జిల్లాకు చెందిన పోలీసుల ఉన్నతాధికారి కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో వివాహాన్ని జరిపించేందుకు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకానున్నారు.

నిహారిక పెళ్లి కారణంగా వకీల్ సాబ్ షూటింగును డిసెంబర్ రెండోవారంలో చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో జరగాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











