పహిల్వాన్‌లతో పవర్ స్టార్ భారీ ఫైట్స్.. నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ సీన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది నుంచి ఈ సినిమాపై పెరుగుతున్న బజ్ అంతా ఇంతా కాదు. ఇక సినిమా కాన్సెప్ట్ కు సంబంధించిన గాసిప్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం కొన్ని లొకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో అయితే గట్టిగానే వైరల్ అవుతున్నాయి. కుస్తి పోటీలు పడే బలమైన విలన్స్ తో కూడా ఒకక్ ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

300ఏళ్ళు వెనక్కి..
దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో భాగ్యనగరాన్ని మూడు వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోగా దర్శకుడు క్రిష్ సరికొత్త ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని మళ్ళీ రెడీ చేసుకున్నాడు. సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు గాని ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు.

టైటిల్ పై చర్చలు
ఇక మూవీకి మొదట విరూపాక్ష అనే టైటిల్ ని సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు దాన్ని కేవలం వర్కింగ్ టైటిల్ గానే అనుకున్నాడు. రీసెంట్ గా హరిహర వీరమల్లు, హరహర మహాదేవ అనే టైటిల్స్ పై కూడా కథనాలు వచ్చాయి. జానపద సినిమాలను తలపించేలా కథను సెట్ చేసుకున్న క్రిష్ ఇంకా ఆ టైటిల్ ని అయితే పూర్తిగా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఆ విషయంపై కూడా చర్చలు జరుపుతున్నారు.

పహిల్వాన్ లతో పవన్ ఫైట్స్
ప్రస్తుతం కొన్ని ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. బలమైన పహిల్వాన్ లతో పవన్ వీరోచిత పోరాటాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయట. లొకేషన్స్ కు సంబంధించిన అనేక రకాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

స్పెషల్ ఎట్రాక్షన్ గా చారిత్రాత్మక కట్టడాలు
ఇక సినిమా కోసం ప్రత్యేకంగా భారీ బడ్జెట్ తో చార్మినార్ సెట్ అలాగే గండికోట ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ బడ్జెట్ లో పవన్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినిమా కథ 17వ శతాబ్ద కాలంలో నడుస్తుందట.. దర్శకుడు క్రిష్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రతి చిన్న విషయాన్ని పక్కా ప్లాన్ తో పూర్తి చేస్తున్నాడు. ఇక వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను అభిమానుల ముందుకు తీసుకు రావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











