తమన్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. బెస్ట్ ఆల్బమ్ ఇస్తానంటోన్న మ్యూజిక్ సెన్సేషన్
అల వైకుంఠపురములో సినిమాపై ఇంతటి హైప్ క్రియేట్ కావడానికి, ఈ రేంజ్ హిట్ అవ్వడానికి తమన్ అందించిన సంగీతమే ప్రధానమని అందరూ ఒప్పుకుంటారు. సామజవరగమన నుంచి మొదలైన ఈ రికార్డుల పరంపర.. బుట్టబొమ్మ సాంగ్ వరకు కొనసాగుతూనే వచ్చింది. వంద మిలియన్ల సాంగ్‌ను వినడమే కష్టమని అనుకునే టాలీవుడ్‌కు.. వరుసగా వంద మిలియన్ల వ్యూస్ సాధించే సత్తా ఉన్న పాటలను అందించాడు తమన్.
తమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ స్టైలీష్ పర్ఫామెన్స్ ఇలా ప్రతీ ఒక్కటి కలిసి అల వైకుంఠపురములో చిత్రాన్ని విజయపథాన నిలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఓవర్సీస్‌లో కేవలం ఒక్క రోజులోనే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను రీచ్ అయింది. ఈ క్రమంలో ఇంతటి ఘన విజయం సాధించిన అల వైకుంఠపురములో చిత్రంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించాడు.

ఈ క్రమంలో తమన్‌పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించాడు. పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షంపై స్పందిస్తూ.. నేను ఆరాధించే వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో ఒక్క సారిగా హార్ట్ బీట్ ఆగింది. మన లీడర్ భవిష్యత్తు శక్తి పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చాయి. సర్ థ్యాంక్స్ యూ మేడ్ మై డే.. అంటూ ఆయన కోసం కంపోజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటూ ఆయన పంపిన బొకేను షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











