Pawan Kalyan ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్: కెరీర్‌లోనే తొలిసారి వేయి మందితో!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ప్రయోగాలతో పాటు కమర్షియల్ సినిమాలు చేసిన ఈ మెగా హీరో.. చాలా విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరో.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించిన నిర్మాతలు.. ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

 Pawan Kalyan Action Sequence Highlight in Harihara Veeramallu

పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కు వరుసగా బ్రేక్‌లు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి.. టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 1000 మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనికోసం పవన్ గతంలో ఎన్నడూ చేయని విధంగా ఫైటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా నిలవబోతున్నట్లు దీనిబట్టి అర్థం అవుతోంది.

క్రేజీ కాంబోలో భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X