తీవ్ర విషాదంలో ప్రధాని మోదీ.. పవన్ కల్యాణ్, అక్షయ్, కంగన భావోద్వేగం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. మోదీ మాతృమూర్తి హీరాబెన్ వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 100 సంవత్సరాల వయసు ఉన్న తల్లి వియోగంతో విషాదంలో మునిగిన ప్రధాని మోదీకి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

శతాధిక వయసు ఉన్న మా మాతృమూర్తి అద్బుతమైన జీవితాన్ని కొనసాగించి భగవంతుడు పాదాల చెంతకు చేరారు. ఈ సందర్భంగా తన తల్లి 100వ బర్త్ డే మధురానుభూతులు పంచుకొన్నారు. తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను ప్రధాని మోదీ షేర్ చేశారు.

Pawan Kalyan, Akshay Kumar, Kangana Ranaut condolences Narendra Modi mother Heerabens death

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మాతృమూర్తి శ్రీమతి హీరా బెన్ మోదీ గారికి స్వర్గగతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడి ప్రార్ధిస్తున్నాను. నిండు నూరేళ్ళపాటు నిష్కామయోగంతో సంపూర్ణ జీవితం చవి చూసిన శ్రీమతి హీరాబెన్ గొప్ప పుణ్యవతి. విలక్షణమైన నాయకత్వపటిమ, నిండుగా మెండుగా దేశ భక్తి కలిగిన శ్రీ నరేంద్ర మోదీ వంటి కుమారునికి జన్మనిచ్చి సచ్ఛీలతతో పెంచి పెద్దచేసి భారత మాత సేవకు కుమారుణ్ని అందించి ఆమె వీరమాతగా నిలిచిపోయారు. ఆమెకు శత వసంతాలు నిండిన సందర్భంగా తన తల్లిని శ్రీ మోదీ గారు కలిసిన సందర్భంలో.. "బుద్ధితో పని చేయాలి.. శుద్ధిగా జీవించాలి" అని తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. తల్లి లేని లోటు తీర్చలేనిది.. ఎవరూ పూడ్చలేనిది. ఇటువంటి దుఃఖ సమయంలో శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, శ్రీ మోదీ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. శ్రీమతి హీరా బెన్ గారికి అంజలి ఘటిస్తూ..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

ప్రధాని మంత్రి తల్లి హీరాబెన్ మరణంపై బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగన రనౌత్, పవన్ కల్యాణ్ తదితరులు శ్రద్దాంజలి ఘటించి సంతాపం తెలిపారు. మీ జీవితంలో ఇంతకంటే విషాదం మరోటి ఉండదు. మీకు భగవంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను. ఓం శాంతి అని అక్షయ్ కుమార్ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

ప్రధానమంత్రి జీవితంలో చోటుచేసుకొన్న విషాదం గురించి కంగన రనౌత్ స్పందిస్తూ.. ఈ కఠిన సమయంలో మోదీజీకి సహనం, శాంతి కలిగించాలని కోరుకొంటున్నాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X