Don't Miss!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కొత్త టైటిల్‌తో షాకిచ్చిన పవన్: హరీశ్ సినిమాను ఇలా మార్చేశారుగా!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో కమ్‌బ్యాక్ అయిన ఈ స్టార్ హీరో.. ఇది పట్టాలపై ఉండగానే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'భీమ్లా నాయక్' అనే సినిమానూ చేశాడు. ఈ చిత్రాలకు మంచి స్పందనే దక్కింది. ఇక, ప్రస్తుతం పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తోన్నాడు. దీంతో పవన్ కల్యాణ్ మరింత జోష్‌తో కొన్ని చిత్రాలను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాడు.
డ్రెస్ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్: పైన మాత్రం ఏమీ లేకుండానే!
'హరిహర వీరమల్లు' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే గతంలో 'గబ్బర్ సింగ్' వంటి భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్‌తోనూ 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అయితే, ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతోన్నా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందని ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. అదే సమయంలో దీన్ని స్క్రిప్టును కూడా మార్చుతున్నారని అన్నారు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేసే సినిమాను మార్చేసి.. ఇళయదళపతి విజయ్ నటించిన 'తేరి' మూవీని రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఇక, ఈ చిత్రాన్ని 'భవదీయుడు భగత్ సింగ్' నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్'గా మార్చేశారు. ఇందుకోసం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో గతంలో ఉన్న పవన్ స్టిల్‌నే ఉంచినా.. బ్యాగ్రౌండ్ మాత్రం మొత్తం మార్చేశారు. దీంతో ఇది కొత్త కథతో వస్తుందని తెలిపారు. మరోవైపు, ఈ చిత్రం 'తేరి' రీమేక్‌గానే వస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.