పవన్‌కు తిలకం దిద్దిన భార్య.. తెలుగు అమ్మాయిలా హారతి ఇస్తూ.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభంజనం సృష్టించింది. నేడు వెలువడుతోన్న ఫలితాల్లో సునామీని సృష్టిస్తూ దూసుకెళ్తోంది. విశ్లేషకుల అంచనాలకు మించేలా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇలా 175 స్థానాలకు గానూ 160కి పైగా నియోజవర్గాల్లో విజయం సాధించే దిశగా పయనిస్తోంది. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచీ హైలైట్ అవుతూ వస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తన నివాసంలో భార్య అన్నా లెజ్‌నేవాతో కనిపించారు. అందులో ఏముందంటే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇలా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటివేయడంతో 100 మార్కును కూడా రీచ్ అయిపోయింది. అంతేకాదు, మరో అరవైకి పైగా సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది.

2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలనే తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసే విధంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ నివాసం నుంచి మంగళగిరికి పయనం అయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు కాసేపటి క్రితమే మంగళగిరి బయలుదేరారు. అంతకు ముందు తన నివాసంలోని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. అప్పుడు ఆయన భార్య అన్నా లెజ్‌నేవా పవన్ నుదిటిన తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











