హాట్ బ్యూటీతో పవన్ కల్యాణ్ ఫైటింగ్: అసలైన ఘట్టానికి డేట్ కూడా ఫిక్స్

చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా.. ఫ్యాన్స్‌ను ఏమాత్రం నిరాశ పరచకుండా వరుసగా సినిమాలు లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తోన్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ మెగా హీరో.. ఇప్పుడు ఏక కాలంలో నాలుగైదు ప్రాజెక్టుల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో పిరియాడిక్ జోనర్‌లో రూపొందిస్తోన్నారు.

మొగల్ సామ్రాజ్యం నేపథ్యంతో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, పవన్ కల్యాణ్ వేరే చిత్రాల షూట్‌లతో బిజీగా ఉండడంతో దీనికి సరైన సమయాన్ని కేటాయించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

Pawan Kalyan and Nora Fatehi Fight Schedule From April 11th

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నెగెటివ్ రోల్‌ను నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో అత్యంత ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ షూట్‌ను ఏప్రిల్ 11వ తేదీ నుంచి జరపబోతున్నారట. ఇందులో పవన్ కల్యాణ్ - నోరా ఫతేహీ మధ్య కొన్ని యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తారని తెలిసింది. ముఖ్యంగా ఇదంతా కత్తులతో సాగే యుద్ధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాలో వీళ్ల కాంబోపై అంచనాలు క్రమంగా పెరుగుతోన్నాయి.

'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ కాగా.. నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X