పవన్ కల్యాణ్, ప్రభాస్‌ సినిమాలే టార్గెట్.. మిస్ అయితే పండుగే పండుగ!

తెలుగు సినిమా దగ్గర భారీ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అనే మాట వస్తే అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ లో ఉండే పేర్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ల పేర్లు తప్పకుండ ఉంటాయని చెప్పాలి. కాగా ఈ టాప్ హీరోలలో ఒకరు తెలుగు రాష్ట్రాలని రూల్ చేస్తుంటే మరో హీరో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నారని చెప్పాలి.

కాగా ఇలా ప్రభాస్ పవన్ లు పలు సినిమాలతో బిజీగా ఉండగా పవన్ ఆల్రెడీ చేసిన పలు సినిమాలు దాదాపు పూర్తి కావస్తుండగా వాటిలో హరిహర వీరమల్లు అనే సినిమా ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం "ది రాజా సాబ్" కూడా రిలీజ్ కి రాబోతుంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇపుడు ఈ ఇద్దరు సినిమాల డేట్స్ లోనే మరిన్ని సినిమాలు డేట్ ని టార్గెట్ పెట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

pawan kalyan and prabhas dates are target for so many releases

కాగా పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు మార్చ్ 28న రిలీజ్ అవుతుంటే ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10కి ఖరారు చేసి ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాలకు పోటీగా తెలుగు సహా ఇతర భాషలు నుంచి కూడా తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు చాలానే ఉండడం గమనార్హం.

మొదటగా పవన్ సినిమా విషయానికే వస్తే మార్చ్ 28 న ఈ సినిమాతో పాటుగా మిడ్ రేంజ్ సినిమాలు మ్యాడ్ స్క్వేర్ మార్చ్ 29 అలాగే మార్చ్ 28న నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలు తెలుగు నుంచి రాబోతున్నాయి. ఇక ఐవి కాకుండా పవన్ సినిమాకి ఒకరోజు ముందు డబ్బింగ్ సినిమాలు మలయాళం నుంచి అవైటెడ్ సినిమా లూసిఫర్ 2 అలాగే తమిళ్ నుంచి విక్రమ్ నటించిన దాన వీర సూర సినిమాలు రాబోతున్నాయి.

pawan kalyan and prabhas dates are target for so many releases

ఇవి ప్రస్తుతానికి అధికారికంగా ఉన్న సినిమాలు. ఇక ప్రభాస్ ది రాజా ఆబ్ డేట్ లో చూస్తే తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంకా ఇదే సినిమా నిర్మాణ సంస్థ తెరకెక్కించిన హిందీ సినిమా జాట్ కూడా అదే డేట్ లో రాబోతుండడం గమనార్హం. ఇక వీటితో పాటుగా తెలుగు సినిమా సిద్ధూ జొన్నలగడ్డ నటించిన జాక్ ని కూడా అదే డేట్ లో కన్ఫర్మ్ చేశారు.

దీంతో ఈ ఇద్దరి టాప్ స్టార్స్ డేట్స్ నే మిగతా సినిమా వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారని చెప్పాలి. అయితే పవన్, ప్రభాస్ సినిమాలు అనుకున్న సమయానికి రాకపోవచ్చని అందుకే వీరు అంతా వస్తున్నట్టుగా పలు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హరిహర వీరమల్లు, రాజా సాబ్ సినిమాలు వాయిదా వేసినట్టుగా దాఖలాలు లేవు. సో వీరి డేట్స్ ని టార్గెట్ చేసిన ఆ సినిమాలు వస్తాయా లేదా అనేది ఈ టాప్ స్టార్స్ నుంచి ఒక క్లారిటీ వస్తే కానీ తేలదు. ఈ రెండు సినిమాలు మిస్ అయితే సమ్మర్ వెకేషన్స్‌లో ఇతర మీడియం రేంజ్ సినిమాలకు పండుగే అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X