Pawan Kalyan - Ram Charan: ఆ విషయంలో పవన్ ఒక్కడే తేడా అనుకున్నాం.. కానీ చెర్రీ కూడా అదే దారిలో వెళ్తున్నాడుగా!

అక్టోబర్ ఒకటో తేదీన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యన జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ప్రతీ విషయం వార్తగా మారింది. పెళ్లికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వేసుకున్న డ్రెస్సులపై కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వారు.. డ్రెస్సులు ఎవరితో డిజైన్ చేయించుకున్నారనే దానిపై కూడా భారీగానే చర్చ సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి, సురేఖ, నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, అల్లు శిరీశ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారికలు వేసుకున్న డ్రెస్సులు హైలెట్ గా నిలిచాయి.

అయితే ఈ పెళ్లి వేడుకలకు హాజరైన పవన్ కల్యాణ్.. ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా సింపుల్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఓ ప్యాంట్ తో పాటు గ్రీన్ కలర్ టీషర్టు వేసుకొని సాదాసీదా వచ్చాడు. అలాగే బాబాయి బాటలోనే తాను కూడా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికో, లేదా వేరో ఏదైనా కారణమో తెలియదు కానీ.. రామ్ చరణ్ కూడా చాలా సింపుల్ గా వచ్చాడు. ముఖ్యంగా ఓ వైట్ కలర్ షర్టు విత్ ప్యాంట్ వేసుకొని పెళ్లికి హాజరయ్యాడు. మిగతా వారంతా చాలా గ్రాండ్ డ్రెస్సులో కనిపిస్తుండగా వీరు మాత్రమే సింపుల్ గా కనిపించి హైలెట్ గా నిలిచారు.

Pawan Kalyan And Ram Charan Wear Simple Dress in Varun Tej Lavanya Tripathi Marriage

అయితే పెళ్లికి సంబంధించిన ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజెన్లు ఈ విషయాన్ని గుర్తించారు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. బాబాయి, అబ్బాయి సేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పండగ, పెళ్లి, పార్టీ.. ఎలాంటింది జరిగినా పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లు అందరికంటే భిన్నంగా కనిపిస్తారని చెప్పుకొస్తున్నారు. అదే విషయాన్ని వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిలో మరోసారి ప్రూవ్ చేశారని అంటున్నారు. పక్కనున్న వాళ్లు ఎంత గ్రాండ్ డ్రెస్సు వేసుకున్నా సరే.. వారి పైకి ప్రజల చూపు మళ్లకుండా చేసుకోవడంలో వీరికి వీరే సాటి అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

Pawan Kalyan And Ram Charan Wear Simple Dress in Varun Tej Lavanya Tripathi Marriage

పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లు సింపుల్ గా కనిపించగా.. వైష్ణవ్ తేజ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, నాగబాబులు షేర్వాణీలు వేసుకొని కనిపించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎక్కడ చూసిన వీరికి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలే దర్శనం ఇస్తున్నాయి. ఇటలీలోని టుస్కానీలో వరుణ్, లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగ్గా... హైదరాబాద్ లో నవంబర్ 5వ తేదీన గ్రాండ్ గా రిసిప్షన్ నిర్వహించబోతున్నారు.

Pawan Kalyan And Ram Charan Wear Simple Dress in Varun Tej Lavanya Tripathi Marriage

సినీ, రాజకీయ ప్రముఖులను పెళ్లికి పిలవలేకపోయిన కారణంగా... భారీ ఎత్తున రిసప్షన్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. చూడాలి మరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల రిసిప్షన్ ఏ స్థాయిలో జరుగుతుంది, ఎవరెవరు ఈ వేడుకకు హాజరై సందడి చేయనున్నారో. ముఖ్యంగా ఈ పార్టీలో కూడా పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లు ఇలా సింపుల్ గానే కనిపిస్తారా లేదా గ్రాండ్ లుక్ లో దర్శనం ఇచ్చి అందరినీ ఫిదా చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X