Bro: మామ అల్లుళ్ల లుక్ అదిరింది 'బ్రో'.. ట్రెండింగ్‌లో పవన్ సాయి తేజ్ పోస్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసెపెట్టి సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఒక్కో సినిమాకు సంబంధించి అప్డేట్స్ వదులుతూ మరింత క్యారియాసిటీ పెంచేస్తున్నారు.
మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా బ్రో (BRO). ఇటీవల టైటిల్, క్యారెక్టర్స్ మోషన్ పోస్టర్స్ తో హైప్ ఇచ్చిన మేకర్స్ తాజాగా కిర్రాక్ ఫొటో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో (Bro Movie). వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాకు తమిళంలో నటించి, దర్శకత్వం వహించి, రూపొందించిన సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.
బ్రో సినిమాకు మొదటి నంచే మంచి బజ్ క్రియేట్ అయింది. తొలిసారిగా మెగా మెనమామ-మేనల్లుడు నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ రెండు కలిపి మొత్తంగా 11 మిలియన్ వ్యూస్ తో సత్తా చాటింది. అలాగే యూట్యూబ్ లో 1.2 లక్షల లైక్స్ కూడా సొంతం చేసుకుంది.
ఇటీవల సాయి ధరమ్ తేజ్ పాత్రను పరిచయం చేస్తూ మరో పోస్టర్ వదిలారు. అందులో సాయి తేజ్ మార్కండేయ (మార్క్)గా అలరించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాజాగా మరోక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి ఉన్న ఈ ఫొటోకు భారీ స్పందన వస్తోంది.
మోటర్ బైక్ పై పవన్ కల్యాణ్ కాలు వేసి చూస్తుంటే.. ఆయన మోకాలిపై చేయి పెట్టి సాయి ధరమ్ తేజ్ నిల్చున్నాడు. ఈ పోస్టర్ అభిమానుల్లో మంచి హైప్ తీసుకొచ్చింది. అందుకే రిలీజైన క్షణాల్లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ మూవీని జూలై 28న విడుదల చేయనున్నారు. అందుకే ఇప్పుడు #BROFromJuly28 అనే ట్రెండింగ్ కొనసాగుతోంది


Click it and Unblock the Notifications











