Bro: 'తమ్ముడు'ని గుర్తు చేస్తున్న పవన్ కల్యాణ్.. వింటేజ్ లుక్‌తో టీజర్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు తగినట్లుగానే వరుస పెట్టి సినిమాలతో పవన్ కల్యాణ్ ఫుల్ ట్రీట్ అందించనున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఒక్కో సినిమాకు సంబంధించి అప్డేట్స్ వదులుతూ మరింత ఆసక్తి పెంచేస్తున్నారు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా బ్రో (BRO)కి సంబంధించి మరో సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం బ్రో (Bro Movie). వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాకు నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించారు. వినోదయ సీతం సినిమాను ఆయన డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో నటించారు. ఇక తెలుగులో వస్తున్న బ్రో మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

బ్రో సినిమాకు మరో సహా నిర్మాతగా వివేక్ కూచిబోట్ల వ్యవహరించారు. ఇదిలా ఉంటే బ్రో చిత్రానికి మొదటి నుంచే హై రేంజ్ బజ్ క్రియేట్ అవడమే కాకుండా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందా.. అని అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ విడుదల తేదిపై క్లారిటీ ఇచ్చారు.
ఆటపట్టించడం అయిపోయింది. ఎంతోమంది ఎదురుచూసిన, అడిగిన బ్రో టీజర్ అప్డేట్ త్వరలోనే వస్తోంది అని నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కల్యామ్ తమ్ముడి చిత్రం తరహాలో ఎర్ర షర్ట్, గల్ల లుంగీలో పవన్ వింటేజ్ లుక్ తో మాసీగా ఉన్నాడు. ఆయన తరహాలోనే సాయి ధరమ్ తేజ్ ప్యాంట్ పైనే లుంగీతో ఉన్న లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో దుమ్ము దులుపుతోంది. ఇక బ్రోను జూలై 28న (#BROFromJuly28) విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











