పవన్ కల్యాణ్ మల్టీస్టారర్‌కు డేట్ ఫిక్స్: ఆ స్పెషల్ డేనే మెగా సర్‌ప్రైజ్
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభం నుంచే తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరించిన అతడు ఎన్నో హిట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం గ్యాపిచ్చిన పవన్.. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి వరుస చిత్రాలతో ఓ రేంజ్‌లో సందడి చేస్తూనే ఉన్నాడు.
ఇప్పటికే ఎన్నో సినిమాలను మొదలు పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాను ఈ స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రను కూడా చేశారు. ఇప్పుడాయనే తెలుగులోకి ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ లీకైంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వినోదయ సీతమ్' సినిమాను గత జూలై మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. దీనికితోడు పవర్ స్టార్ మరికొన్ని ప్రాజెక్టులు ప్రకటించడంతో ఈ మూవీ చేయరని అంతా అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఫిబ్రవరి 14న జరగబోతుందట. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇది మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. దీనితో పాటు హరీష్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని చేయనున్నాడు. అలాగే, సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మరో చిత్రాన్ని కూడా ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











