పవన్ మల్టీస్టారర్ మూవీకి డేట్ ఫిక్స్: ఫ్యాన్స్‌కు త్వరలోనే అదిరిపోయే ట్రీట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్‌ ఉన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అదే సమయంలో భారీ హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం సినిమాలకు గ్యాపిచ్చిన పవన్.. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫలితంగా ఖుషీ అయిన అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను అందుకుంది. అయితే, అప్పుడు టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా ఈ చిత్రానికి కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అయినప్పటికీ ఈ రిజల్ట్ పట్ల అటు పవన్.. ఇటు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్సాహంతోనే పవన్ కల్యాణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే 'హరిహర వీరమల్లు' సినిమా షూట్‌లో కూడా పాల్గొన్నాడు. త్వరలోనే దీని కోసం పూర్తి స్థాయిలో డేట్స్‌ను ఇవ్వబోతున్నాడు.

 Pawan Kalyan and Sai Dharam Tej Movie Starts From July 12th

ఇప్పటికే చాలా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టుకున్న టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రను కూడా చేశారు. ఇప్పుడాయనే తెలుగులోకి ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు కూడా ఇదే వార్తను కన్ఫార్మ్ చేసేసిన విషయం తెలిసిందే.

'వినోదయ సీతమ్' మూవీ మెగా మల్టీస్టారర్‌గా రూపొందనుందని తెలిసినప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, ఇది ఎప్పుడు మొదలు కాబోతుందో మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను జూలై 12 వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారట. అప్పటి నుంచి చాలా తక్కువ వ్యవధిలోనే ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అంటే ఈ సినిమాను 'హరిహర వీరమల్లు' కంటే ముందే విడుదల చేయబోతున్నారని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఇది పవన్ కల్యాణ్ అభిమానులకు సర్‌ప్రైజింగ్ న్యూసే అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'వినోదయ సీతమ్' రీమేక్ కోసం పవన్ కల్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించాడట. అంతేకాదు, దీని తర్వాత ఈ స్టార్ సినిమా సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. పాలిటిక్స్ మీద ఫోకస్ చేయడం కోసమే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అందుకే ముందుగా పవర్ స్టార్ సీన్స్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌తో ఉన్న కాంబినేషన్ సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X