Pawan Kalyan సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో కొత్త మూవీ.. సముద్రఖని దర్వకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో జీ స్టూడియో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిమ్మకాయల ప్రసాద్, విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ ప్రారంభోత్సవ వేడుక వివరాల్లోకి వెళితే..

వినోదయ సీతమ్ ప్రారంభ వేడుక కోసం

వినోదయ సీతమ్ ప్రారంభ వేడుక కోసం

వినోదయ సీతమ్ రీమేక్ సినిమా పూజా కార్యక్రమానికి పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు వివేక్ కూచిబొట్ల, విశ్వప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు సముద్రఖని తదితరులు హాజరయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్‌లో నిరాడంబరంగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది.

పవన్ కల్యాణ్‌కు సాదర ఆహ్వానం

పవన్ కల్యాణ్‌కు సాదర ఆహ్వానం


సముద్రఖని దర్శకత్వంలో రూపొందే ఇంకా పేరు పెట్టని సినిమా పూజా కార్యక్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు నిర్మాతలు ఘనంగా స్వాగతం పలికారు. పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సముద్రఖని, వివేక్ కూచిబొట్ల, విశ్వప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం లాంఛనంగా తొలి షాట్‌ను చిత్రీకరించారు.

 స్కిప్టు పేపర్లతో మామ, అల్లుళ్ల కుస్తీ

స్కిప్టు పేపర్లతో మామ, అల్లుళ్ల కుస్తీ


వినోదయ సీతమ్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సముద్రఖని, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి స్క్రిప్ట్ పేపర్లను చదువుతున్న ఫోటోలు మీడియాలో హైలెట్ అయ్యాయి. సాయిధరమ్ తేజ్‌ను పవన్ కల్యాణ్ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్న ఫోటోలు కూడా అభిమానులను ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.

వినోదయ సీతమ్‌కు విమర్శకుల ప్రశంసలు

వినోదయ సీతమ్‌కు విమర్శకుల ప్రశంసలు


వినోదయ సీతమ్ సినిమా విషయానికి వస్తే.. 2021లో జీ5 ఓటీటీలో రిలీజైంది. ఫాంటసీ, కామెడీ, డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహించి నటించారు. తంబి రామయ్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సీని విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.

పవన్ కల్యాణ్ స్టామినాకు తగినట్టుగా

పవన్ కల్యాణ్ స్టామినాకు తగినట్టుగా


వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్దమైంది. తెలుగు నేటివిటికి, పవన్ కల్యాణ్ స్టార్ స్టామినాకు తగినట్టుగా సినిమా కథలో మార్పులు చేర్పులు చేశారు. సాయిధరమ్ తేజ్‌ను ప్రాజెక్టులోకి తీసుకొని.. మల్టీస్టారర్ సినిమా లుక్‌ను క్రియేట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X