OG: పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. పక్కకు తప్పుకోండి అంటూ హెచ్చరిస్తూ!
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత నుంచి రాకెట్ వేగంతో దూసుకెళ్తూ.. సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరో చేయని విధంగా కొద్ది రోజుల గ్యాప్‌లోనే నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్న ఈ మెగా హీరో.. తన సమయాన్ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు.ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కల్యాణ్ 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమాను కూడా చేస్తున్నాడు. సాహో ఫేం సుజిత్ తెరకెక్కించే ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయని చెప్పొచ్చు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ మూవీనే 'OG'. పవర్ ప్యాక్‌డ్ స్టోరీలైన్‌తో రాబోతున్న ఈ సినిమా ఓ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ మొదట్లోనే ప్రకటించింది. అంతేకాదు, పోస్టర్‌తోనే అంచనాలను రెట్టింపు చేసేసింది.

ఇక, ఈ మూవీని వీలైనంత త్వరగా ప్రారంభించి.. వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని ముంబైలో ప్రారంభించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ ఓ అదిరే అప్‌డేట్‌ను వదిలింది.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జనవరిలోనే జరిగాయి. కానీ, షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇక, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను నేటి నుంచి ముంబైలో ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
అంతేకాదు, ఓ ఆర్ట్‌ను కూడా షేర్ చేసి 'ఓజీ కోసం పక్కకు తప్పుకోండి' అంటూ వార్నింగ్ ఇచ్చేలా పోస్ట్ చేసింది. ఇక, ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్ సహా మెయిన్ లీడ్ చేస్తోన్న చాలా మంది ప్రముఖులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తారని టాక్.
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందించే ఈ సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











