OG: పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ న్యూస్.. సీక్రెట్‌గా షురూ చేసినా లీకైందిగా!
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్‌లోనే ఎన్నడూ లేనంత జోష్‌తో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చిన అతడు.. అప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇలా ఇప్పుడు 'హరిహర వీరమల్లు', 'వినోదయ సీతమ్' రీమేక్, 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలను పట్టాలెక్కించేశాడు. ఇవి షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే ఇప్పుడు పవన్ కల్యాణ్ మరికొన్ని ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టాడు. అందులో సురేందర్ రెడ్డి తెరకెక్కించే మూవీ కూడా ఉంది.

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. 'సాహో' సినిమాతో చిన్న వయసులోనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించిన యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఓ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
అంతేకాదు, దీనికి OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు. దాదాపుగా దీన్నే టైటిల్‌గానూ ఖరారు చేయబోతున్నారు. ఇక, తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి ఓ బ్లాస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అన్న క్లారిటీ రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు పని చేస్తున్న సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ చేసిన పోస్టుతో కీలక సమాచారం లీకైంది.
షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ ఫొటోను షేర్ చేసిన ఆయన.. 'ఓజీ' మూవీ టెస్ట్ షూట్ అని ట్యాగ్ చేశారు. దీంతో పవన్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుందని కూడా ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇదిలా ఉండగా.. పవన్ హీరోగా సుజిత్ రూపొందించే ఈ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయిని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











