పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా... సురేందర్ రెడ్డితో మూవీ రిలీజ్ డేట్ లాక్, థియేటర్‌లోకి ఎప్పుడంటే?

గత కొంతకాలంగా రాజకీయాలు, పరిపాలనతో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది హరిహర వీరమల్లు, ఓజీలతో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్‌తో ప్రేక్షకులను పలకరించనున్నారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు ఈ మూడు సినిమాలకు కమిట్‌మెంట్ ఇవ్వడంతో ఈ మూడు సినిమాల తర్వాత ఇండస్ట్రీకి గుడ్‌బై చెబుతారని టాక్ నడిచింది. అయితే ఈ ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు.

ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారని చిత్ర పరిశ్రమలో టాక్ నడిచింది. దీనికి చెక్ పెడుతూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానులను అలరించారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం గడ్డం పెంచుతూ రఫ్‌ లుక్‌ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్టైలీష్ లుక్‌లో పవన్ కళ్యాణ్ కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

Pawan Kalyan and Surender Reddy s Pan-India Film Targeting Sankranti 2027 Release

ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పనుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. మార్చి 26న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు, ప్రమోషనల్ కార్యక్రమాలు పూర్తి చేసి పవన్ ఇక ఫ్రీ అయిపోతారు. ఆ వెంటనే సురేందర్ రెడ్డితో మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఉగాదిని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని చెబుతున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఓజీలో గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కళ్యాణ్ అలరించడంతో ఇదే సబ్జెక్ట్‌తో ముందుకు వెళ్తారని చెబుతున్నారు. సురేందర్ రెడ్డి - పవన్ కళ్యాణ్ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. అలాగా ఈ మూవీలో ఓ స్టార్ హీరో విలన్‌ రోల్ పోషించనున్నారట.

ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా రాజకీయంగా, పాలనాపరంగా బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రోజుకు 6-7 గంటలు సినిమాకు కేటాయించనున్నారని ఫిలింనగర్ టాక్. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది. అనేదానిపై సోష్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి మూవీ విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ఈ సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

2027 సంక్రాంతికి వచ్చే సినిమాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి. చిరంజీవి - బాబీ, అనిల్ రావిపూడి - వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి వస్తున్నట్లు ముందుగానే ప్రకటించాయి. వీటితో పాటు బాలకృష్ణ - గోపీచంద్ మలినేని, నాగార్జున 100వ సినిమా కూడా సంక్రాంతికే బరిలో దిగబోతున్నట్లుగా ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు. చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోని నలుగురు అగ్రహీరోలు తమ సినిమాలతో పోటీపడుతుండటంతో వచ్చే సంక్రాంతి హోరెత్తనుంది. ఈ నలుగురు కాకుండా శ్రీనువైట్ల - శర్వానంద్ మూవీ, తేజ సజ్జా మూవీలు కూడా సంక్రాంతికే బరిలో దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ మూవీ కూడా సంక్రాంతికే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడంతో ఈసారి పెద్దపండగకి సందడి మామూలుగా ఉండదని అంటున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X