పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. రంగంలోకి త్రివిక్రమ్..! బయటకొచ్చిన అసలు మ్యాటర్

మాటల మాంత్రికుడి కాలానికి ఎంత పవర్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన కలం నుంచి జాలువారిన డైలాగ్స్ వింటుంటే ప్రతీ ఒక్కరి రోమాలు నిక్కబొడవాల్సిందే!. తెర వెనుక నుంచే తెరపై చక్రం తిప్పడంలో దిట్ట త్రివిక్రమ్ శ్రీనివాస్. అదే బాటలో తాజాగా పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తూ తనవంతుగా పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రిపేర్ చేస్తున్నారట ఈ మాటల మాంత్రికుడు.

ఖాయమైన పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ

ఖాయమైన పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారనే వార్త మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న 'పింక్' రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ ఖాయం అయింది.

ఎంటర్ కాబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

ఎంటర్ కాబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

ఈ ప్రాజెక్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాండ్ కీలకం కానుందనేది తాజా సమాచారం. పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ మధ్య ఉన్న బాండింగ్ కారణంగా పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం భారీ డైలాగులు రాస్తున్నారట మాటల మాంత్రికుడు. ఇప్పటికే కొంత మేర డైలాగ్ వెర్షన్ ఆయన పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

గతంలో పవన్- త్రివిక్రమ్

గతంలో పవన్- త్రివిక్రమ్

తొలిసారి ‘జల్సా' సినిమాతో పవన్- త్రివిక్రమ్ మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికీ దారేది' సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇక ఇటీవలే వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' సినిమా మాత్రం అంచనాలు తలకిందులు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి పవన్‌తో కలిసి మరో మ్యాజిక్ చేయాలని ఫిక్స్ అయ్యారట త్రివిక్రమ్.

పవన్ సరసన హీరోయిన్ ఫిక్స్

పవన్ సరసన హీరోయిన్ ఫిక్స్

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేను పవన్ సరసన తీసుకోవాలని నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

‘పింక్' తెలుగు రీమేక్ విశేషాలు

‘పింక్' తెలుగు రీమేక్ విశేషాలు

హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X