పవన్ కళ్యాణ్ లిస్టులో మరో మెగా మల్టీస్టారర్.. ఆ దర్శకుడితో త్రివిక్రమ్ చర్చలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో మరోవైపు రెగ్యులర్ మూవీస్ తో చాలా బిజీ బిజీగా మారిపోయారు ఎక్కువగా పాలిటిక్స్ పైనే ఆయన ఫోకస్ చేస్తున్నప్పటికీ వీలైనప్పుడల్లా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ పనులను కూడా శరవేగంగా ఫినిష్ చేసుకుంటున్నారు. ఇక చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే మరోవైపు పవన్ క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేసినందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో పవన్ కు సంబంధించిన మరొక కొత్త ప్రాజెక్ట్ చర్చలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

త్రివిక్రమ్ ఆధ్వర్యంలో: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా పాల్గొంటున్నాడు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కునేందుకు పవన్ రెగ్యులర్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రత్యేకంగా త్రివిక్రమ్ పవన్ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎక్కువగా పవన్ చేయబోయే సినిమాల పనులు కూడా కొనసాగుతున్నాయి.

Pawan kalyan another multi starter movie with trivikram story line

సగానికి పైగా ఫినిష్: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగానికి పైగా ఫినిష్ కాగా మరోవైపు ఓజి ప్రాజెక్టు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టులు కూడా మొదలైపోయాయి. ఇక ఇదివరకే పవన్ జెట్ స్పీడ్ లో వినోదాయ సీతంకు సంబంధించిన ప్రాజెక్టు పనులను కూడా ఫినిష్ చేసుకున్నాడు.

ముందే ఇదే..: అయితే పవన్ కళ్యాణ్ ముందుగా వినోదయ సీతం రీమేక్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక వీలైనంత త్వరగా ఆ సినిమా షూటింగ్ పనులను ఫినిష్ చేసుకుని రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు.

మరో మల్టీస్టారర్: అయితే పవన్ కళ్యాణ్ హీరోగా మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును కూడా తెరపైకి తీసుకురావాలని త్రివిక్రమ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా రీమేక్ కాకుండా స్ట్రైట్ కథతో రావాలని అనుకుంటున్నారట. ప్రత్యేకంగా త్రివిక్రమ్ కథ మాటలు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక దర్శకుడితో కూడా చర్చలు మొదలయ్యాయి.

Pawan kalyan another multi starter movie with trivikram story line

అతనే డైరెక్టర్: ఇక ఆదర్శకుడు మరెవరో కాదు. సుధీర్ వర్మ తెలుస్తోంది. ఇదివరకే అతను త్రివిక్రమ్ తో చర్చలు స్టార్ట్ చేసినట్లు రావణాసుర ప్రమోషన్ లో చెప్పారు. ఇక ఇటీవల రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ వర్మ ఊహించిన విధంగా డిజాస్టర్ అయితే ఎదుర్కొన్నాడు. అయితే అంతకుముందు అతను తీసిన స్వామి రారా, దోచేయ్ అలాగే కేశవ లాంటి సినిమాలతో మంచి టెక్నీషియన్ గా గుర్తింపునందుకున్నాడు. కానీ అతను మాత్రం ఇటీవల రావణాసుర సినిమాకు డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరో హీరో ఎవరంటే..: ఇక పవన్ కళ్యాణ్ చేయబోయే కొత్త మల్టీస్టారర్ లో మరో హీరోగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో కూడా సినిమా చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ కాంబినేషన్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X