భీష్మ మూవీ భేష్.. నితిన్‌, వెంకీ, వంశీకి పవన్ కల్యాణ్ అభినందన..

యువ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. సినిమా రిలీజైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తూ భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ రేంజ్‌లోకి వెళ్లడంతో ట్రేడ్ వర్గాల్లో ఆనందం నెలకొన్నది. ఈ సినిమా టీమ్‌పై పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పవన్ కల్యాణ్‌ను కలిశారు.

Recommended Video

Pawan Kalyan Appreciates Nithiin And Bheeshma Team | Filmibeat Telugu
పవన్ కల్యాణ్‌ను కలిసిన నితిన్

పవన్ కల్యాణ్‌ను కలిసిన నితిన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు హీరో నితిన్ అభిమాని అనే సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన హీరోను కలిసేందుకు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. సందర్భం ఏదైనా తన హీరో గురించి మాట్లాడకుండా ఉన్న క్షణాలు తక్కువే కనిపిస్తాయి. అలాంటి క్రమంలో భారీ హిట్‌ను అందుకొన్న సందర్భంలో పవన్ కలిసి అభినందనలు అందుకొన్నారు.

భీష్మ టీమ్‌పై ప్రశంసల వర్షం

భీష్మ టీమ్‌పై ప్రశంసల వర్షం

భీష్మ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొంటున్న తనను కలిసిన నిర్మాత నాగవంశీని, దర్శకుడు వెంకీ కుడుమలను పవన్ కల్యాణ్ సాధారంగా ఆహ్వానించి అభినందించారు. మంచి సినిమాను రూపొందించి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంపై పవన్ సంతోషాన్ని వ్యక్తం చేశారని, మున్ముందు రికార్డు కలెక్షన్లు సాధించాలని కోరుకొన్నట్టు నిర్మాత, దర్శకుడు తెలిపారు.

మూడు రోజుల్లో కుమ్మేసిన కలెక్షన్లు

మూడు రోజుల్లో కుమ్మేసిన కలెక్షన్లు

భీష్మ చిత్రం గత మూడు రోజుల్లో భారీ వసూళ్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.32 కోట్ల గ్రాస్, రూ.19 కోట్ల షేర్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం రూ.23 కోట్ల షేర్ సాధిస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

ఇక భీష్మ చిత్రం ఏపీ, తెలంగాణలో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో రూ.18 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.1.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఈ చిత్రం రూ.22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X