PSPKRana Movie: పవన్ కళ్యాణ్ పాత్ర పేరు తెలిసిపోయింది.. పోలీస్ డ్రెస్ లో పవర్ స్టార్ లుక్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ - రానా మూవీ టాప్ లో ఉందని చెప్పవచ్చు. అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక చాలా రోజుల అనంతరం మళ్ళీ సినిమా సెట్స్ పైకి రాగా పవర్ స్టార్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత్ర పేరు కూడా తెలిసిపోయింది.

రీమేక్ అయినప్పటికీ..

రీమేక్ అయినప్పటికీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనంతరం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మలయాళం సినిమాకు రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కచ్చితంగా కొత్తగా ట్రై చేస్తాడని చెప్పవచ్చు. అందుకే అభిమానుల్లో ఈ సినిమాపై గట్టి నమ్మకమే పేర్చుకున్నారు.

భారీ బడ్జెట్ తోనే సినిమా నిర్మాణం

భారీ బడ్జెట్ తోనే సినిమా నిర్మాణం

సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశి నిర్మిస్తున్నారు. సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నప్పటికి కరోనా కారణంగా వాయిదా పడుతోంది.

Recommended Video

PSPK 28 : స్క్రిప్ట్ కెవ్వుకేక, మరో గబ్బర్ సింగ్ కి గెట్ రెడీ | Pawan Kalyan || Filmibeat Telugu
హై వోల్టేజ్ లుక్

హై వోల్టేజ్ లుక్

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన షెడ్యూల్ ని ఇటీవల స్టార్ట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా లొకేషన్ లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ లుక్కుతో కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది.

భీమ్లా నాయక్ పాత్రలో పవర్ స్టార్

భీమ్లా నాయక్ పాత్రలో పవర్ స్టార్

కేవలం అలా బ్యాక్ స్టిల్ బయటకు రాగానే ఒక్కసారిగా ట్రేడింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అని తెలుస్తోంది. ఆ పాత్రలో పవర్ స్టార్ నెవర్ బిఫోర్ అనే బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకోనున్నాడు. ఇక ఆ పాత్రకు తగ్గట్లుగానే త్రివిక్రమ్ డైలాగ్స్ తూటాల్లా ఉంటాయట. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X