చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్: చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 22న ఆయన 64వ వడిలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అభిమానులు పుట్టినరోజు వేడుక గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి మెగాస్టార్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదకలో ఆగస్టు 21న సాయంత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేయబోతున్నారట.

Pawan Kalyan as Chief Guest at Chiranjeevis 64th Birthday Celebration

త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుక మరింత గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. వైభవంగా జరుగబోతున్న ఈ ఈవెంటులో సైరా మేకింగ్ వీడియో, టీజర్ కూడా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో తెరకెక్కించారు. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X