పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌స్టార్.. ఇక ఆ విషమంలో పవన్ కళ్యాణ్ దూకుడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో దూసుకెళ్తున్నాడు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ విడుదలకు సిద్దంగా ఉండగా, మరో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మరో సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఆ సంస్థ ప్రాజెక్టు వివరాలను అధికారికంగా వెల్లడించింది.
Recommended Video

సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కే చంద్రను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తు వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు.

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారి తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. గబ్బర్ సింగ్‌గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు అని ప్రకటనలో సితార ఎంటర్‌టైన్ మెంట్ ప్రకటించింది.
సాంకేతిక నిపుణులు వీరే
ఇంకా పేరు పెట్టని చిత్రానికి థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్‌గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏఎస్ ప్రకాష్ఎంపిక అయ్యారు అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. అయితే ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించిన ఓ చిత్రం రీమేక్‌గా రూపొందుతున్నదనే ఊహాగానాలు మీడియాలో మొదలయ్యాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దసరా శుభాకాంక్షలు తెలిపిన నాగవంశీ
పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది, చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చెబుతూ మీడియా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు, విజయదశమి శుభాకాంక్షలు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు


Click it and Unblock the Notifications











