మరోసారి ఎన్టీఆర్‌తో పవన్ కళ్యాణ్.. పక్కనే రాజమౌళి.. ఎందుకు కలిశారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోల మధ్య నెలకొన్న వాతావరణం అభిమానుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మన అగ్ర హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండడం కూడా ఎంతగానో కిక్కిస్తోంది. ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీకి మధ్య కూడా బాండింగ్ రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మరోసారి కలుసుకున్నారు.

రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాల్సిందే..

రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాల్సిందే..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెలిసిందే. RRR కంటే ముందే వీరిద్దరు మంచి స్నేహితులు. ఇక రాజమౌళి కలయిక వల్ల వారి ఫ్రెండ్షిప్ వాల్యూ మరింత పెరిగింది. మెగా నందమూరి అభిమానులు ఈ ఇద్దరి హీరోలను ఇప్పుడు సమానంగా చూస్తున్నారు. ఇంతటి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన రాజమౌళికి కూడా ఒక విదంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే.

నందమూరి ఫ్యామిలితో పవన్

నందమూరి ఫ్యామిలితో పవన్

జూనియర్ ఎన్టీఆర్ ముందు నుంచి కూడా అందరి హీరోలతో చాలా క్లోజ్ గానే ఉంటున్నాడు. అయితే ఆ సంగతులు ఎక్కువగా బయటకు రాలేదు అంతే. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఎన్టీఆర్ కు మంచి రిలేషన్ ఉంది. నందమూరి హరికృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన వేడుకలకు పవన్ కళ్యాణ్ అప్పట్లో రెగ్యులర్ గా వెళుతుండేవారు. ఆ విధంగా పవన్, ఎన్టీఆర్ మధ్య చాలా సందర్భాల్లో గంటల తరబడి చర్చలు జరిగేవట.

త్రివిక్రమ్ ద్వారా మొదటిసారి..

త్రివిక్రమ్ ద్వారా మొదటిసారి..

ఇక చాలా కాలం తరువాత త్రివిక్రమ్ ద్వారా ఇద్దరి స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం దక్కింది. అరవింద సమేత లాంచ్ అయినప్పుడు పవన్ ముఖ్య అతిథిగా అక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో పవన్, ఎన్టీఆర్ మధ్య కొంతసేపు చర్చలు కూడా జరిగాయి.

RRR సెట్స్ లో పవన్..

RRR సెట్స్ లో పవన్..

ఇక మళ్ళీ ఆ తరువాత పవన్, ఎన్టీఆర్ ఎదురుపడే సమయం రాలేదు. కానీ ఇటీవల రెండే షూటింగ్స్ లు ఒకే చోట జరగడం వలన అది జరిగింది. ఫొటోలు బయటకు రాకుండా చిత్ర యూనిట్ సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ స్వయంగా RRR సెట్స్ కు వెళ్లి ఎన్టీఆర్ ను కలుసుకున్నాడట. పవన్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.

ఫొటోలు లీక్ అవ్వకుండా..

ఫొటోలు లీక్ అవ్వకుండా..

అయితే కొంచెం దూరంలో RRR సెట్స్ ఉండడంతో పవన్ అక్కడికి వెళ్లి రాజమౌళిని ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. సెట్స్ ను సందర్శించిన పవన్, తారక్ తో అలాగే రాజమౌళితో సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారట. ఇక ఎలాంటి ఫొటోలు లీక్ అవ్వకుండా దర్శకుడు రాజమౌళి ముందే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాన్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X