వాళ్లే నా బలం.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు మెగా బ్రదర్స్.. వైరల్ అవుతోన్న పిక్
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ ఓ మహా వృక్షం లాంటింది. చిరంజీవితో మొదలైన ఈ ప్రస్థానం శాఖోపశాఖలుగా విస్తరించి నేటి ప్రస్తుత స్థితికి వచ్చింది. ముళ్ల బాటల్లో నడుచుకుంటూ వచ్చిన చిరంజీవి.. తన కుటుంబానికి పూల బాటను ఏర్పర్చాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి వారు దూసుకుపోతుందగా.. కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ ఇప్పుడిప్పుడే కెరీర్‌ను ప్రారంభిస్తున్నారు.

ఫుల్ స్వింగ్‌లో ఉన్న మెగా కాంపౌండ్..
ప్రస్తుతం మెగా కాంపౌండ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఎఫ్2, వాల్మీకి లాంటి హిట్లతో వరుణ్ ఫుల్ జోష్‌లో ఉండగా.. సైరా చిత్రంతో సంబరాలు మరింత పెరిగాయి. మెగా బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని నమోదు చేయడంతో మెగా హీరోలంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

అందరూ కలిసిన ఈవెంట్..
ఆ మధ్య నాగబాబు 60వ పుట్టిన రోజు వేడుకులను అత్యంత ఘనంగా సెలెబ్రేట్ చేసింది మెగా ఫ్యామిలీ. ఈ వేడుకలకు మెగా హీరోలంతా హాజరయ్యారు.. అంతేకాకుండా టోటల్ అల్లు వారి కుటుంబం కూడా హాజరైన ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అప్పట్లో వీటికి సంబంధించిన పిక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Recommended Video
కానరాని పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్‌కు తన అన్నయ్యలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన అన్న, తమ్ముడు కాపాడాడని వారు లేకుంటే తాను లేనన ఎంతో గొప్పగా చెపుకుంటాడు నాగబాబు. అలా ఆ ముగ్గురి మధ్య ఉన్న బంధం గురించి మెగాభిమానులందరికీ తెలిసిందే. ఆయన నాగబాబు 60వ పుట్టిన రోజు వేడుకల్లో పవన్ కనబకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అప్పటి పిక్‌ను పోస్ట్ చేసిన వరుణ్..
అయితే పవన్ కళ్యాణ్ ఆ వేడుకలకు హాజరయ్యాడని వరుణ్ తేజ్ తాజాగా పోస్ట్ చేసిన పిక్‌తో తెలుస్తోంది. ఈ వేడుకల్లో ముగ్గురు మెగా బ్రదర్స్‌తో తాను దిగిన ఫోటోను షేర్ చేసిన వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. వీళ్లే నా బలం అన్నట్లుగా ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











